న్యూఢిల్లీ: ఆఫీసు జాగా సరఫరా గత ఏడాది ఢిల్లీ, ముంబైలో వరుసగా 15 శాతం. 37 శాతం తగ్గిందని కోలియర్స్ ఇండియా వెల్లడించింది. దేశీయ, విదేశీ సంస్థల ల నుంచి నుంచి డిమాండ్ డిమా బలంగా ఉన్నప్పటికీ సరఫరా తగ్గింది. బెంగళూరు, ఢిల్లీఎన్సీఆర్, ముంబై, హైద రాబాద్, చెన్నై, పుణె, కోల్ కతాలో డిమాండ్ కంటే కొత్త సరఫరా తక్కువగా ఉంది. టెక్నాలజీ, బీఎఫ్ ఎస్.ఐ రంగాలు ప్రధానంగా ఈ డిమాండ్ను పెంచుతున్నాయి.
ఢిల్లీ -ఎన్సీఆర్లో కొత్త సరఫరా 8.7 మిలియన్ చదరపు అడుగుల నుంచి 7.4 మిలియన్ చదరపు అడుగులకు పడిపోయింది. ముంబైలో 8.3 మిలియన్ చదరపు అడుగుల నుంచి 5.2 మిలియన్ చదరపు అడుగులకు తగ్గింది. హైదరాబాద్లో 21 శాతం తగ్గి 10.8 మిలియన్ చదరపు అడుగులుగా నమోదైంది. కోల్కతాలో ఏకంగా 80 శాతం క్షీణత కనిపించింది. అయితే చెన్నై, బెంగళూరు, పుణె మార్కె ట్లలో కొత్త సరఫరా పెరిగింది. అద్దెలు సగటున 15 శాతం వరకు పెరిగాయి.
