- రూ. 20 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివేత
రామచంద్రాపురం, వెలుగు: సంగారెడ్డి జిల్లా సైబరాబాద్ కమీషనరేట్ పరిధిలోని కొల్లూర్ స్టేషన్ ఎస్సై రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. వివరాలిలా ఉన్నాయి.. స్టేషన్లో నమోదైన ఎసెన్షియల్ కమొడిటీస్ కేసులో ఫిర్యాదుదారుడి పేరు తొలగించేందుకు కొల్లూర్ ఎస్సై రమేశ్ రూ.30 వేలు లంచం డిమాండ్ చేసి, గత నెల 17న రూ.5 వేలు అడ్వాన్స్‌గా తీసుకున్నాడు. మిగిలిన డబ్బుల కోసం ఎస్సై ఇబ్బంది పెట్టడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. శుక్రవారం ఎస్సైకి రూ.20 వేలు అందజేయగా, రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎస్సైని ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరుపరిచారు.
