తెలంగాణ వ్యాప్తంగా టెట్ పరీక్ష మొదలైంది. జనవరి 3 నుంచి 20వ తేదీ వరకు ఆన్ లైన్ విధానంలో జరగనున్న టెట్ పరీక్షలు ఇవాళ మొదలయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటల వరకు మొదటి షిఫ్ట్, మధ్యాహ్నం 2 నుంచి 4:30 గంటల వరకు రెండవ రెండవ షిఫ్ట్ లో పరీక్షలు జరగనున్నాయి. అయితే.. నిమిషం లేట్ అయినా అభ్యర్థులను లోపలికి పంపలేదు సిబ్బంది. దీంతో పలువురు అభ్యర్థులు ఎగ్జామ్ సెంటర్ నుంచి నిరాశతో వెనుదిరిగారు.
హయత్ నగర్ లోని అయాన్ డిజిటల్ సెంటర్ దగ్గరికి ఆలస్యంగా వచ్చిన ముగ్గురు మహిళా అభ్యర్థులను అనుమతించలేదు సిబ్బంది. పరీక్ష మిస్ అయ్యామని కన్నీళ్లు పెట్టుకున్నారు అభ్యర్థులు. కర్మన్ ఘాట్ లోని మరో సెంటర్లో కూడా లేట్ గా వచ్చిన అభ్యర్థులను అనుమతించలేదు సిబ్బంది. దీంతో కన్నీటి పర్యంతం అయ్యారు అభ్యర్థులు. వందలాది కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన తమకు పరీక్షకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు అభ్యర్థులు.
2026 సంవత్సరానికి గాను టెట్ పరీక్షలు పరీక్షలు జనవరి 3న ప్రారంభమైన జనవరి 20న ముగియనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లోని పరీక్షా కేంద్రాల్లో జరుగుతాయి. ఉపాధ్యాయ అర్హత పరీక్షల్లో రెండు పేపర్లు ఉంటాయి.ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు బోధించేందుకు పేపర్-1 పరీక్ష, ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు బోధించేందుకు పేపర్-2 రాయాల్సి ఉంటుంది.
జనవరి 3 న.. మొదటి సెషన్ లో..
- మ్యాథమెటిక్స్ పేపర్ 2 పరీక్ష..
- హన్మకొండ, హైదరాబాద్, జోగులాంబ గద్వాల్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, ఖమ్మం, జనగాం, మెదక్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, కామారెడ్డి అభ్యర్థులకు నిర్వహంచనున్నారు.
- రెండో సెషన్ లో మ్యాథమెటిక్స్ పేపర్ 2 పరీక్ష
- ములుగు, కరీంనగర్, మహబూబాబాద్, నారాయణపేట, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, సూర్యాపేట
జనవరి 4న.. మొదటి సెషన్ లో..
- మ్యాథమెటిక్స్ పేపర్ 2 పరీక్ష..
- మంచిర్యాల్, నాగర్‌కర్నూల్, నల్గొండ, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డి
- రెండో సెషన్ లో మ్యాథమెటిక్స్ పేపర్ 2 పరీక్ష ..
- యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, పెద్దపల్లి, ఇతరులు, వికారాబాద్, వనపర్తి, ఆదిలాబాద్, వరంగల్, జగిత్యాల
జనవరి 5న.. మొదటి సెషన్ లో..
- సోషల్ స్టడీస్ పేపర్ 2 పరీక్ష..
- ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, హైదరాబాద్, జగిత్యాల, జనగాం,జయశంకర్ భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి,పెద్దపల్లి
- రెండో సెషన్ లో..సోషల్ స్టడీస్ పేపర్ 2 పరీక్ష..
- కరీంనగర్, ఖమ్మం, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, మెదక్, ములుగు
జనవరి 6న.. మొదటి సెషన్ లో..
- సోషల్ స్టడీస్ పేపర్ 2 పరీక్ష..
- నాగర్‌కర్నూల్, నల్గొండ, నారాయణపేట, నిర్మల్, వికారాబాద్, ఇతరాలు, నిజామాబాద్
- జనవరి 6న.. రెండో సెషన్ లో..
- సోషల్ స్టడీస్ పేపర్ 2 పరీక్ష..
- యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, వరంగల్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వనపర్తి, సిద్దిపేట, సూర్యాపేట
జనవరి 8న..మొదటి సెషన్ లో పేపర్ 1 పరీక్ష..
- మంచిర్యాల, మెదక్, ములుగు, నాగర్‌కర్నూల్, నల్గొండ, నారాయణపేట, మేడ్చల్ మల్కాజిగిరి, వనపర్తి
- రెండోసెషన్ లో పేపర్ 1 పరీక్ష..
- హనుమకొండ, కామారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి
- జనవరి 9న..మొదటి సెషన్ లో పేపర్ 1 పరీక్ష..
- వికారాబాద్, సిద్దిపేట, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, ఖమ్మం, కుమ్రం భీం ఆసిఫాబాద్
జనవరి 11న..మొదటి సెషన్ లో పేపర్ 1 పరీక్ష..
- ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, హైదరాబాద్, జగిత్యాల
- రెండో సెషన్ లో పేపర్ 1 పరీక్ష..
- మహబూబాబాద్, మహబూబ్ నగర్, పెద్దపల్లి, జనగాం, నిర్మల్, జోగులాంబ గద్వాల్
- జనవరి 19న..మొదటి సెషన్ లో పేపర్ 1 (మైనర్) పరీక్ష.. బెంగాలీ, హిందీ, కన్నడ, తమిల్, ఉర్దూ, మరాఠీ మీడియంలో అన్ని జిల్లాల అభ్యర్థులకు నిర్వహిస్తారు.
- జనవరి 20న..మొదటి సెషన్ లో పేపర్ 2 (మైనర్) పరీక్ష.. మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ స్టడీస్ అభ్యర్థులకు హిందీ, కన్నడ, తమిళ్, ఉర్దూ, మరాఠీ, సంస్కృతం మీడియంలో అన్ని జిల్లాల అభ్యర్థులకు నిర్వహిస్తారు.
