కొత్త ఏడాది కూడా బంగారం, వెండి కునుకులేకుండా చేస్తున్నాయి తమ ర్యాలీతో. డిసెంబరులో చూపించిన అదే దూకుడు పెరుగుదలను ఈ విలువైన లోహాలను ప్రస్తుతం మళ్లీ కొనసాగిస్తున్నాయి. దీంతో భారతదేశంలోని మధ్యతరగతి ప్రజలు వీలైనంత త్వరగా షాపింగ్ ఫినిష్ చేయాలని భావిస్తున్నారు. అయితే ఏదైనా కొనుగోలు చేసే ముందుగా మీ ప్రాంతంలో ఉన్న తాజా రిటైల్ రేట్లను పరిశీలించి నిర్ణయం తీసుకోండి కొత్త ఏడాదిలో.
తెలుగు రాష్ట్రాల్లో జనవరి 2, 2026న బంగారం రేట్లు పెరిగాయి. దీంతో జనవరి 1 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.114 పెరిగింది. తాజా తగ్గింపుతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.13వేల 620గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు ఇవాళ గ్రాముకు రూ.12వేల 485గా తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో అమ్మకాలు జగురుతున్నాయి.
ALSO READ : ఫిబ్రవరి 1 నుంచి పెరగనున్న సిగరెట్ ధరలు
కొత్త ఏడాదిలో తగ్గేదేలే అన్నట్లుగా వెండి తిరిగి తన ర్యాలీని ముందుకు తీసుకెళుతోంది. దీంతో శుక్రవారం జనవరి 2, 2026న వెండి రేటు 4వేల రూపాయలు పెరుగుదలను నమోదు చేసింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు రూ.2లక్షల 60వేలుగా ఉంది. అంటే గ్రాము ధర రూ.260 వద్ద నేడు కొనసాగుతోంది.
