త్వరలో రిటైల్ ట్రేడ్ పాలసీ!

త్వరలో రిటైల్ ట్రేడ్ పాలసీ!
  • వ్యాపారుల కోసం ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా

న్యూఢిల్లీ: వ్యాపారుల కోసం త్వరలో రిటైల్ ట్రేడ్ పాలసీను ప్రభుత్వం తీసుకురానుందని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. అంతేకాకుండా జీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీ కింద రిజిస్టర్ అయిన ట్రేడర్లకు యాక్సిడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్సూరెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కవరేజిని అందించనుందని వివరించారు. రిటైల్ ట్రేడ్ పాలసీ వలన ట్రేడర్లు మరిన్ని లోన్లు ఈజీగా తీసుకోవడానికి వీలుంటుందని, ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా మెరుగుపడుతుందని అన్నారు. ‘రిటైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రేడ్ పాలసీలో వేగంగా, ఈజీగా అప్పు పొందడానికి సంబంధించిన రూల్స్ ఉంటాయి. రిటైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వ్యాపారాన్ని మరింత  మోడర్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మార్చడానికి, డిజిటలైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడానికి గల అంశాలు ఉంటాయి’ అని అన్నారు. డిస్ట్రిబ్యూషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మెరుగుపరచడం, స్కిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రమోట్ చేయడం, లేబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రొడక్టివిటీని పెంచడం, మెరుగైన గ్రీవెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిడ్రెసల్ మెకానిజంను ప్రొవైడ్ చేయడం వంటివి ఈ పాలసీలో ఉంటాయని వివరించారు.

రిటైల్ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించి గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఐదో ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియా ఉంది. జీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీ రిజిస్టర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వ్యాపారుల కోసం ఒక ఇన్సూరెన్స్ స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కూడా  తెచ్చేందుకు కామర్స్ మినిస్ట్రీ, ఫైనాన్స్ మినిస్ట్రీ కలిసి పనిచేస్తున్నాయి. ‘ఈ–కామర్స్ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే కాదు ఫిజికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రేడర్ల కోసం కూడా రిటైల్ పాలసీ తీసుకురావాలని ప్రభుత్వం చూస్తోంది. ఈ పాలసీతో వ్యాపారం మరింత సులభంగా మారుతుంది. ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ మెరుగువుతుంది. అప్పు మరింత దొరుకుతుంది’ అని ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు. ఈ పాలసీ కింద సింగిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విండొ మెకానిజం తీసుకురానున్నారని అన్నారు. వ్యాపారాన్ని మరింతగా మెరుగుపడడానికి రిటైల్ ట్రేడ్ పాలసీ కచ్చితంగా సాయపడుతుందని  కాన్ఫెడరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (సీఏఐటీ) పేర్కొంది.