వర్షాకాల సమావేశాల తొలి రోజు లోక్ సభలో సుప్రీంకోర్టు జడ్జిల పెంపు బిల్లును ప్రవేశపెట్టారు. సోమవారం(జూలై 20) ఓ పక్క కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు కొనసాగుతున్నప్పటికీ సభను కొనసాగించారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మెఘ్వాల్ సుప్రీంకోర్టు (న్యాయమూర్తుల సంఖ్య) సవరణ బిల్లు 2026ను లోక్ సభలో ప్రవేశపెట్టారు 1956 నాటి సుప్రీంకోర్టు చట్టాన్ని సవరిస్తూ ఈ బిల్లును తీసుకొచ్చిన ఈ బిల్లు సభ ఆమోదం పొందింది. మంజూరైన సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్య 33 నుంచి 37 పెంచేందుకు గతంలో జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానంలో ఈ చట్టం తీసుకువస్తున్నారు.
సోమవారం తొలి రోజు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభానికి ముందే నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్, రామమందిర విరాళాల చోరీపై సీజేపీ, ప్రతిపక్షాలు నిరసనలు చేపట్టాయి. దీంతో పార్లమెంట్ సమావేశాలకు అంతరాయం ఏర్పడింది. సభను మధ్యాహ్నం 2 వాయిదా వేశారు.
ALSO READ : అమిత్ షాతో ధర్మేంద్ర ప్రధాన్ అనూహ్య భేటీ
ఏంటీ సుప్రీం కోర్టు సవరణ బిల్లు?..
ఈ బిల్లు అత్యున్నత న్యాయస్థానంలో ఉండాల్సిన న్యాయమూర్తుల సంఖ్యను పెంచడానికి తీసుకొచ్చారు. ఇది చీఫ్ జస్టిస్ మినహాయించి న్యాయమూర్తుల సంఖ్యను 33 నుంచి 37కి పెంచాలని ప్రతిపాదిస్తుంది. సీజేఐతో కలిపి, సుప్రీం కోర్టులో మొత్తం మంజూరైన న్యాయమూర్తుల సంఖ్య 38కి చేరనుంది. ప్రస్తుతం ఈ న్యాయస్థానం (సీజేఐతో సహా) కేవలం 32 మంది న్యాయమూర్తులతోనే పనిచేస్తోంది. న్యాయమూర్తుల పెంపుతో న్యాయస్థానం సమర్థవంతంగా పనిచేయడానికి అవకాశం ఉంది.
