
వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ, టెక్నీషియన్ పోస్టుల భర్తీ కోసం హైదరాబాద్ లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఈసీఐఎల్ అధికారిక వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు జూన్ 5 ఆఖరు.
గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ
- పోస్టులు: 80
- డిపార్ట్మెంట్స్: ఈసీఈ/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్, ఇనుస్ట్రుమెంటేషన్, సీఎస్ఈ/ ఐటీ, మెకానికల్, ఈఈఈ/ ఎలక్ట్రికల్, సివిల్, కెమికల్
- ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ లేదా బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- వయోపరిమితి: 2025, ఏప్రిల్ 30 నాటికి 27 ఏండ్లు మించకూడదు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
- అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1000.
- అప్లికేషన్ ప్రారంభం: మే 16.
- లాస్ట్ డేట్: జూన్ 5.
- సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
టెక్నీషియన్(గ్రేడ్–2)
- పోస్టులు: 45
- డిపార్ట్ మెంట్స్: వెల్డర్, కార్పెంటర్, పెయింటర్, టర్నర్, షీట్ మెటల్, ఎలక్ట్రీషియన్, మెషనిస్ట్, ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్.
- ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి పదోతరగతి, ఐటీఐ ఉత్తీర్ణత. మాన్యు ఫాక్చరింగ్ విభాగంలో పని అనుభవం ఉండాలి.
- వయోపరిమితి: 2025, ఏప్రిల్ 30 నాటికి 27 ఏండ్లు మించకూడదు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
- అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.750.
- అప్లికేషన్ ప్రారంభం: మే 16.
- లాస్ట్ డేట్: జూన్ 5.
- సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.