వడ్ల కొనుగోళ్లకు హమాలీ కష్టాలు!..స్థానికంగా కూలీలు దొరకక నత్తనడకన ధాన్యం సేకరణ

వడ్ల కొనుగోళ్లకు హమాలీ కష్టాలు!..స్థానికంగా కూలీలు దొరకక నత్తనడకన ధాన్యం సేకరణ
  • స్థానికంగా కూలీలు దొరకక నత్తనడకన ధాన్యం సేకరణ 
  • బెంగాల్, బిహార్, చత్తీస్​గఢ్ కూలీలు తిరిగిరాక ఇబ్బందులు
  • ఎండల ఎఫెక్ట్​తో పగటిపూట పనులకు బ్రేక్​ 
  • లారీలు రాక కొనుగోలు కేంద్రాల్లోనే పేరుకుపోతున్న బస్తాలు.. యాసంగి టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సగమే పూర్తి

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌/నెట్​వర్క్​, వెలుగు: రాష్ట్రంలో వడ్ల కొనుగోళ్లకు ‘హమాలీ’కష్టాలు తీవ్రమయ్యాయి. స్వస్థలాలకు వెళ్లిన పశ్చిమ బెంగాల్, బిహార్, చత్తీస్​గఢ్​ కూలీలు తిరిగిరావడం లేదు. ఇటు స్థానికంగా కూలీలు దొరకట్లేదు. ఉన్న కొద్దిమంది ఎండ దెబ్బకు పగటి పూట పనులు బంద్​ పెడ్తున్నారు. దీంతో లోడింగ్​, అన్​లోడింగ్​ ఆలస్యమై, కొనుగోళ్లపై తీవ్ర ప్రభావం పడ్తోంది. కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లుల వరకు ఎక్కడ చూసినా లోడింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోడింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సమస్యగా మారింది. ఇక్కడ మార్కెట్​ యార్డులు, రైస్ ​మిల్లుల్లో చాలాకాలంగా వెస్ట్​ బెంగాల్​, బిహార్​ రాష్ట్రాలకు చెందిన కూలీలే పని చేస్తున్నారు. ఎన్నికలు, ఇతర కారణాలతో సీజన్​కు ముందు సొంత ఊళ్లకు వెళ్లిన కూలీల్లో సగానికి పైగా తిరిగిరాలేదు. దీంతో మిల్లులు, గోదాముల్లో లోడింగ్, అన్​ లోడింగ్​ వేగంగా జరగడంలేదు. స్థానికంగా కూలీలు దొరకకపోవడం, మండుతున్న ఎండల వల్ల పగటి పూట హమాలీలు పని చేయకపోవడంతో సమస్య మరింత ముదిరింది. హమాలీలు పొద్దున, సాయంత్రం మాత్రమే బస్తాలను దింపడంతో వడ్లుతీసుకొచ్చిన లారీలు గోదాములు, మిల్లుల వద్ద బారులు తీరి కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల లారీలు అన్​లోడ్​ కావడానికి రెండు మూడు రోజులు కూడా పడుతోందని చెప్తున్నారు. 


దీంతో కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు ఆగిపోయి.. రైతులు ధాన్యానికి కాపలా కాస్తూ అవస్థలు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వేగంగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. లోడింగ్​, అన్​లోడింగ్​కు ప్రభుత్వం ఖరారు చేసిన రేట్లు తక్కువ ఉన్నాయని కొన్ని చోట్ల హమాలీలు క్వింటాలుకు రూ. 15 నుంచి 20 వరకు రైతుల నుంచి అదనంగా వసూలు చేస్తున్నారన్న విమర్శలున్నాయి. అదనంగా డబ్బులు తీసుకోవద్దని అధికారులు చెప్తున్నా వారు ఖాతరు చేయడంలేదన్న విమర్శలున్నాయి. డబ్బులు ఇవ్వని రైతుల వడ్లను దింపకుండా జాప్యం చేస్తున్నట్టు తెలుస్తోంది. అన్​లోడింగ్​ ఆలస్యం కావడంతో మిల్లుల దగ్గర లారీలు రోజుల తరబడి నిలిచిపోతున్నాయి. దీనివల్ల తమకు నష్టం కలుగుతుందని యజమానులు లారీలను పంపడానికి నిరాకరిస్తున్నారు. లారీల కొరతను అధికగమించడానికి కొన్ని జిల్లాల్లో రైతులు తమ ట్రాక్టర్లలో ధ్యాన్యాన్ని తరలించేందుకు అధికారులు అనుమతించారు. ప్రభుత్వం కూడా లారీల కొరత మీద దృష్టి పెట్టింది. హైవేల మీద ఖాళీగా వెళ్తున్న లారీలను వడ్ల రవాణాకోసం మళ్లించాలని ప్రభుత్వం జిల్లా అధికారులను ఆదేశించింది.


మిల్లుల వద్ద రోజుల తరబడి లారీలు

పెద్దపల్లి, ములుగు, యాదాద్రి, జనగామ జిల్లాల్లో హమాలీల కొరత తీవ్రంగా ఉంది. మిల్లుల్లో అన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోడింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రెండు నుంచి నాలుగు రోజుల వరకు సమయం పడుతోంది. ఒక్కో లారీ వారం రోజుల వరకు మిల్లుల వద్దే నిలిచిపోవడంతో కొత్త లారీలు రాక కొనుగోళ్లు మందగిస్తున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో అవసరమైన లారీల సంఖ్యలో సగం కూడా అందుబాటులో లేకపోవడంతో ధాన్యం తరలింపులో తీవ్ర ఆటంకం ఏర్పడింది. మంచిర్యాల జిల్లాలో మిల్లింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కెపాసిటీ తక్కువగా ఉండటంతో ధాన్యాన్ని ఇతర జిల్లాలకు తరలించాలని నిర్ణయించినా అక్కడి మిల్లర్లు అన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోడింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ముందుకు రావడం లేదు. హమాలీల కొరతతో ఒక్కో లారీ ఖాళీ కావడానికి నాలుగైదు రోజులు పడుతోంది. కొన్ని జిల్లాల్లో హమాలీలు దొరకక రైతులే బస్తాలు మోసి లారీల్లో ఎక్కించాల్సిన పరిస్థితి ఏర్పడింది. “తూకం వేసిన తర్వాత మీరే అన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకోవాలి.. లేదంటే లారీలు రావు”అని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు చెప్పడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోతున్న బస్తాలు

రాష్ట్రవ్యాప్తంగా యాసంగి ధాన్యం కొనుగోళ్లు 90 లక్షల టన్నులు లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటివరకు సగం వరకే కొనుగోళ్లు పూర్తయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 8,575 కొనుగోలు కేంద్రాల్లో చాలా సెంటర్లలో తూకం వేసిన బస్తాలు పేరుకుపోతున్నాయి. రోజుకు ఒకటి లేదా రెండు లారీలు మాత్రమే రావడంతో ధాన్యం తరలింపు ఆలస్యమవుతోంది. నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మెదక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సంగారెడ్డి జిల్లాల్లో రైతులు రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్దే పడిగాపులు కాస్తున్నారు. అకాల వర్షాల భయంతో ధాన్యాన్ని కాపాడుకోవడానికి రైతులు రాత్రింబవళ్లు యార్డుల దగ్గరే గడుపుతున్నారు. కొన్ని జిల్లాల్లో దొడ్డు రకం వడ్ల కొనుగోళ్లు పూర్తిగా నిలిచిపోయాయి. తూకాలు వేయకపోవడం, మిల్లర్లు నిరాకరించడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యం కొనుగోళ్లు ఆలస్యం కావడంతో పలుచోట్ల రైతులు నిరసనలు చేపడుతున్నారు. “వడ్లు పోసి 20 రోజులు అవుతోంది.. ఎవరూ పట్టించుకోవడం లేదు. వర్షాలు వస్తే మా పరిస్థితి ఏంటి?”అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే హమాలీలు, లారీలు, గన్నీ సంచులు సమకూర్చి కొనుగోళ్లు వేగవంతం చేయాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు.