వాసాలమర్రిలో కొత్త గ్రామ పంచాయతీకి నిరాకరణ

వాసాలమర్రిలో కొత్త గ్రామ పంచాయతీకి నిరాకరణ

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో కొత్త గ్రామ పంచాయతీ నిర్మాణననికి గ్రామస్థులు నిరాకరించారు. ఊరి మధ్యలో ప్రస్తుతం ఉన్న గ్రామ పంచాయతీ వద్దే కొత్త భవనం నిర్మించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ప్రజలు అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఎట్టి పరిస్థితిల్లో ఇక్కడ గ్రామ పంచాయతీ భవనం నిర్మాణం చెయ్యెద్దని ప్రజలు అధికారులను వేడుకుంటున్నారు.

గ్రామం అభివృద్ధికి తాము సహకరిస్తున్నాం..కానీ ఈ విషయంలో అధికారులు తమకు సహకరించాలని గ్రామస్థులు కోరుతున్నారు. అయితే కొత్తగా నిర్మిస్తున్న భవనం రోడ్డుకు అటువైపు నిర్మించడంతో రోడ్డు దాటి వెళ్లడం ప్రజలకు ఇబ్బంది అవుతుందని గ్రామస్థుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.