ఘట్కేసర్ మండలం ఔషపూర్ గ్రామపంచాయతీలో గత మూడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని గ్రామపంచాయతీ సిబ్బంది ధర్నాకు దిగారు. అడ్డగోలు సాకిరి చేపించుకుంటున్నా అధికారులు జీతం ఇవ్వమంటే ఇవ్వడం లేదని తాము ఏలా బ్రతకాలని కార్మికురాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మంత్రి మల్లరెడ్డి తమ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సకాలంలో జీతాలు వచ్చే విధంగా చూడాలన్నారు. అలాగే తమకు జీతాలు పెంచి EF,PF కట్ అయ్యేటట్టు చూడాలని కోరారు. అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లి మొరపెట్టుకున్నా తమ బాధను ఎవరు అర్థం చేసుకోవడం లేదని తెలిపారు. కరోనా సమయంలో దేనికి భయపడకుండా విధులు నిర్వహించామని.. అది కూడా గుర్తించుకోకుండా తమకు సరైన జీతాలు ఇవ్వడం లేదని చెప్పారు.
తెలంగాణ వస్తే తమ జీవితాలు బాగుపడతాయి అనుకుంటే..తెలంగాణ వచ్చిన తర్వాత మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని కార్మికురాలు వెల్లడించారు. తినడానికి బియ్యం లేక పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టలేక నానా ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. ఇకనైనా అధికారులు తమపై దయ తలచి జీతాలు ఇవ్వాలని కోరారు. గ్రామపంచాయతీ సిబ్బందికి మద్దతుగా ఘట్కేసర్ ఎంపీపీ ధర్నాలో పాల్గొన్నారు. ఎన్నో ఏండ్ల నుండి గ్రామ పంచాయతీలో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు సరైన సమయంలో ప్రభుత్వం జీతాలు ఇయకుంటే ఎలా బతుకుతారని ఎంపీపీ ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సకాలంలో పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇయ్యాలని డిమాండ్ చేశారు.
