గాంధీ భవన్లో ఘనంగా బోనాలు..పాల్గొన్న రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు స్వర్ణ, మహిళలు

గాంధీ భవన్లో ఘనంగా బోనాలు..పాల్గొన్న రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు స్వర్ణ, మహిళలు

హైదరాబాద్, వెలుగు: మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంగళవారం గాంధీభవన్​లో ఆషాఢ మాస బోనాలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఆధ్వర్యంలో మహిళలు వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వర్ణ మాట్లాడుతూ తెలంగాణ మహిళలకు ఎంతో ఇష్టమైన పండుగ బోనాలు అని తెలిపారు. ఈ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పడుతుందన్నారు. ఈ ఏడాది వర్షాలు బాగా కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు.