విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెడ్ లో  ఘనంగా  జాతీయ భద్రతా వారోత్సవాలు..

విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెడ్ లో  ఘనంగా  జాతీయ భద్రతా వారోత్సవాలు..

జాతీయభద్రతా వారోత్సవాల ముగింపు కార్యక్రమం విశాఖ ఇండస్ట్రీస్​ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. 55 వ జాతీయ భద్రత వారోత్సవాల కార్యక్రమాలను   గజలాపురం  విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెడ్ లో నిర్వహించారు. ఈ వారోత్సవాల్లో  భాగంగా మార్చి 1 వ తేదీ నుండి కర్మాగారం లో భద్రతకు సంబంధించి వివిధ కార్యక్రమాలు నిర్వహించారు.  అలాగే మార్చి  7 వ తేదీన ముగింపు కార్యక్రమం  ఘనంగా జరిగింది. 

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డిప్యూటీ చీఫ్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్  కె.వీ.శ్రీదేవి ,  ఇన్ స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ జంగయ్య పాల్గొన్నారు. ఫ్యాక్టరీల్లో కార్మికుల భద్రత గురించి వివరించారు.  ఈ సందర్భంగా జరిగిన వివిధ రకాల పోటీల్లో గెలుపొందిన  విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్టరీ మేనేజర్  గాయం శ్రీనివాస రెడ్డి, హెచ్​ ఆర్​ . పెరికెటి నాగార్జున, మాలోతు రవి నాయిక్ , భద్రత అధికారి ఉల్వనీరు శ్రీనయ్య , ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.