
శంషాబాద్, వెలుగు: శంషాబాద్ శ్రీ వెండికొండ సిద్ధేశ్వర (సిద్దులగుట్ట) జాతర వైభవంగా జరుగుతోంది. తొలి రోజైన శనివారం ఉత్సవమూర్తుల ఊరేగింపు జరగగా, రెండో రోజు ఆదివారం తెల్లవారుజామున మహా రుద్రాభిషేకం, అమ్మవారికి అభిషేకం, కుంకుమార్చనలు జరిగాయి. మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చిన్నారుల భరతనాట్య నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. శంషాబాద్, హైదరాబాద్, సికింద్రాబాద్, చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయం ప్రాంగణం మార్మోగుతోంది. చివరి రోజైన సోమవారం వేకువజామున పార్వతీ పరమేశ్వరుల కల్యాణం, అగ్నిగుండాల కార్యక్రమం జరగనుంది.