AMBలో ‘అమ్ము’ ప్రత్యేక ప్రదర్శన

AMBలో ‘అమ్ము’ ప్రత్యేక ప్రదర్శన

అమెజాన్ ప్రైమ్ వీడియో మొదటి తెలుగు ఒరిజినల్ మూవీ ‘అమ్ము’ సినిమా విడుదల కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  ఈ చిత్రం ప్రీమియర్ షోను  గచ్చిబౌలిలోని AMBలో చిత్ర యూనిట్, సిబ్బంది ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కార్తీక్ సుబ్బరాజ్, నవీన్ చంద్ర, నిహారిక కొణిదెల, దేవకట్టా, శరత్ మరార్, రాజ్ కందుకూరి. స్వాతి ఈ ప్రీమియర్ కు హాజరయ్యారు.

అమ్ము పాత్రలో ఐశ్వర్య లక్ష్మి నటించారు. పోలీసు భర్త రవి పాత్రలో నవీన్ చంద్ర నటించారు. ‘అమ్ము’ సహనానికి పరీక్ష ఎదురైన క్షణంలో, తన స్వేచ్ఛను తిరిగి పొందడానికి బాబీసింహా పోషించిన అపరిచిత మిత్రుడి పాత్రతో జతకడుతుంది. దీనికి కార్తీక్ సుబ్బరాజ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌ కాగా, చారుకేష్ శేఖర్ రచన, దర్శకత్వం వహించారు. స్టోన్ బెంచ్ ఫిలిమ్స్ నిర్మించిన ఈ డ్రామా థ్రిల్లర్‌ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో 2022 అక్టోబర్ 19 నుంచి ప్రైమ్ వీడియోలో ప్రత్యేకంగా విడుదల కానుంది.