గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీని గుర్తించండి : కార్యదర్శులు మామిడి సోమయ్య

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీని గుర్తించండి : కార్యదర్శులు మామిడి సోమయ్య

హైదరాబాద్ సిటీ, వెలుగు: జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయింపులో గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీని గుర్తించాలని సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులు మామిడి సోమయ్య, బొల్లం శ్రీనివాస్  సోమవారం సెక్రటేరియేట్ లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. 2008లో తమ సొసైటీ  ఏర్పడిందని,17 ఏండ్లలో నాలుగు దఫాలుగా జర్నలిస్టుల సభ్యత్వ నమోదు చేశామన్నారు. 

ప్రస్తుతం సొసైటీలో వెయ్యి మందికి పైగా జర్నలిస్టులు సభ్యులుగా ఉన్నారన్నారు. అయినా తమ సొసైటీని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవడం లేదన్నారు. మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డిని, ఐఅండ్ పీఆర్ స్పెషల్ కమిషనర్ ముకుంద రెడ్డిని కలిసి వినతి పత్రాలు సమర్పించారు.