రాత్రికి రాత్రే ఏం మారింది : రూ.5 వేలు పెరిగిన వెండి.. బంగారం ధర కూడా..!

రాత్రికి రాత్రే ఏం మారింది : రూ.5 వేలు పెరిగిన వెండి.. బంగారం ధర కూడా..!

నిన్న మెున్నటి వరకూ కూల్ మోడ్ లో ఉన్న బంగారం, వెండి ఒక్కసారిగా మళ్లీ పెరగటం స్టార్ట్ అయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా బులియన్ మార్కెట్లు మళ్లీ హీటెక్కిపోతున్నాయి. అంతర్జాతీయంగా మారుతున్న పరిస్థితులే దీనికి కారణం అంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో షాపింగ్ చేయాలనుకుంటున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ముందుగా తమ నగరాల్లో ధరలను పరిశీలించటం బెటర్. 

ఆగస్టు 5న బంగారం రేట్లు పెరిగాయి. ఆగస్టు 4 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా రూ.175  పెరిగింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.14వేల 575గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.13వేల 360గా కొనసాగుతోంది. 

బుధవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. ఆగస్టు 5, 2026న దేశవ్యాప్తంగా కేజీకి రూ.5వేలు పెరిగింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు కేజీకి రూ.2లక్షల 40వేలుగా ఉంది. అంటే గ్రాము దాదాపు రూ.240 దగ్గర ఉంది.