హైదరాబాద్ సిటీ బస్సుల్లో ఎక్కువగా జర్నీ చేస్తుంటారా..? అయితే, మీకు ఓ గుడ్ న్యూస్..

హైదరాబాద్ సిటీ బస్సుల్లో ఎక్కువగా జర్నీ చేస్తుంటారా..? అయితే, మీకు ఓ గుడ్ న్యూస్..

హైదరాబాద్​సిటీ, వెలుగు: పంద్రాగస్టు సందర్భంగా గ్రేటర్ ఆర్టీసీ ‘ట్రావెల్ యాజ్ యు లైక్’ టికెట్ ధరలను తగ్గించింది. పెద్దలకు రూ.150 నుంచి రూ.130, మహిళలు, సీనియర్ సిటిజన్లకు రూ.120 నుంచి రూ.110, పిల్లలకు రూ.100 నుంచి రూ.90కి తగ్గించారు. 

ఈ టికెట్​కొనుగోలు చేసిన వారు ఒక రోజంతా సిటీ ఆర్డినరీ, మెట్రోఎక్స్​ ప్రెస్​ బస్సుల్లోనే ప్రయాణించే అవకాశం ఉండగా.. ఇకపై మెట్రో డీలక్స్ బస్సుల్లోనూ ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నారు. ఈ ఆఫర్ ఈ నెల 31 వరకు వర్తించనుంది.