డిగ్రీ, హోటల్ మేనేజ్‌‌‌‌‌‌‌మెంట్‌తో ఉద్యోగాలు.. రూ.92 వేల నుంచి రూ.లక్షన్నర వరకు జీతం

డిగ్రీ, హోటల్ మేనేజ్‌‌‌‌‌‌‌మెంట్‌తో ఉద్యోగాలు.. రూ.92 వేల నుంచి రూ.లక్షన్నర వరకు జీతం
  • వెయ్యి కొలువులిస్తం.. నిరుద్యోగులను పంపండి
  • టామ్ కామ్‌‌‌‌‌‌‌‌ను కోరిన గ్రీస్ దేశం అధికారులు
  • అర్హత ఉన్నోళ్లు అప్లై చేసుకోవాలని టామ్‌‌‌‌‌‌‌‌ కామ్‌‌‌‌‌‌‌‌ సూచన

హైదరాబాద్, వెలుగు: తమ దేశంలో ఉద్యోగాలు ఉన్నాయని, నిరుద్యోగులను పంపాలంటూ తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్ కామ్)ను గ్రీస్ దేశం కోరింది. ఈ మేరకు కేటగిరీల వారీగా పోస్టులు, అర్హత, వేతనాల వివరాలను ప్రకటించింది. తమ దేశంలో హౌస్ కీపింగ్, వెయిటర్స్, కుక్స్, హోటల్ రిసెప్షనిస్ట్, ఎలక్ట్రిషియన్స్, ప్లంబర్లు, మెయింటెన్స్, లైఫ్ గార్డ్స్ తదితర విభాగాల్లో 1,000 పోస్టులు ఉన్నాయని అక్కడి అధికారులు తెలిపారు. 

దీంతో అర్హత ఉన్న నిరుద్యోగులు ఈ జాబ్స్‌‌‌‌‌‌‌‌కు అప్లై చేసుకోవాలని టామ్ కామ్ అధికారులు కోరారు. వీరికి వసతి, ఫుడ్, మెడికల్ ఇన్సూరెన్స్ ఉచితంగా అందిస్తామని గ్రీస్ అధికారులు పేర్కొన్నట్లు వెల్లడించారు. 8 గంటలు వర్కింగ్, ఇంగ్లీష్ భాష తప్పనిసరని పేర్కొన్నారు. అలాగే, 21 ఏండ్ల నుంచి 35 ఏండ్ల లోపు యువతీ యువకులు మాత్రమే అర్హులని అధికారులు వెల్లడించారు. ఈ ఉద్యోగాలకు ఆసక్తి ఉన్నవాళ్లు tomcom.resume@gmail.com <mailto:tomcom.resume@gmail.com> కు రెస్యూమ్ పంపాలని టామ్ కామ్ అధికారులు సూచించారు. 

వచ్చే రెండేండ్లలో 11 వేల మందిని పంపే ప్లాన్..

విదేశాల్లో ఉద్యోగాల కోసం వచ్చే రెండేండ్లలో 11 వేల మందిని పంపేందుకు టామ్ కామ్ ప్లాన్ చేస్తోంది. జనవరి 2023 నుంచి ఇప్పటి వరకు మొత్తం 11 దేశాలకు 9,172 మందిని పంపారు. వీటిలో కువైట్‌‌‌‌‌‌‌‌కు 8,298 మంది, యూఏఈకి 184 మంది, సౌదీ అరేబియాకు 55 మంది, ఇజ్రాయెల్‌‌‌‌‌‌‌‌కు 546 మంది, ఆస్ట్రేలియా, జర్మనీ, జపాన్, గ్రీస్, జపాన్ దేశాలకు నిరుద్యోగులను పంపించారు. గత నెలలో టామ్ కామ్ ద్వారా జర్మనీలో ఉద్యోగాలు పొందిన 13 మందికి గత నెలలో కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్ సర్టిఫికెట్స్‌‌‌‌‌‌‌‌ అందజేశారు. వీరికి రూ.2.8 లక్షల వేతనం ఇవ్వనున్నారు. విదేశాల్లో ఉద్యోగాలు పొంది అక్కడకు వెళ్తున్న వారికి ఐఈఎస్ అనే సంస్థ స్కిల్ ట్రైనింగ్ ఇస్తోంది. వీరితో టామ్ కామ్ ఒప్పందం కుదుర్చుకుంది. వీళ్లంతా నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్లు కావడం గమనార్హం. 

ఐటీఐ, ఏటీసీలపై అధికారుల ఫోకస్‌‌‌‌‌‌‌‌..

ఐటీఐ, ఏటీసీల్లో కోర్సులు నేర్చుకుంటూ వివిధ అంశాల్లో శిక్షణ తీసుకుంటున్న నిరుద్యోగులపై అధికారులు ఫోకస్ పెట్టారు. ఈ రెండు సంస్థల నుంచి 5 వేల మంది స్కిల్డ్‌‌‌‌‌‌‌‌ నిరుద్యోగులను తీసుకోనున్నట్లు అధికారులు వెల్లడించారు. వీరికి స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి విదేశీ భాషలు నేర్చించి అక్కడ ఉద్యోగాలు సాధించేలా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. కాగా, ఈ ఏడాది ఇప్పటికే ఐటీఐ, ఏటీసీల్లో 99 శాతం అడ్మిషన్లు పూర్తి అయ్యాయి.

పోస్టులు                                                       వేతనం                                            అర్హత
హౌస్ కీపింగ్, వెయిటర్స్, కుక్స్              రూ.97 వేలు                 డిప్లోమా లేదా హోటల్ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లో డిగ్రీ
హోటల్ రిసెప్షనిస్ట్                                 రూ.97 వేలు                  డిప్లోమా లేదా హోటల్ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లో డిగ్రీ 
స్పా థెరపిస్ట్                                              రూ.1,22,000                 ప్రభుత్వ ట్రైనింగ్ సెంటర్ నుంచి 
                                                                                                         సంబంధిత విభాగంలో స్కిల్ సర్టిఫికేట్
ఎలక్ట్రిషియన్స్, ప్లంబర్లు,                        రూ.97 వేలు                  ప్రభుత్వ ట్రైనింగ్ సెంటర్ నుంచి 
  మెయింటెన్స్, లైఫ్ గార్డ్స్                                                             సంబంధిత విభాగంలో స్కిల్ సర్టిఫికెట్
గార్డెనెర్స్, క్లీనర్స్, 
బెల్ బాయ్స్, ఫిషర్ మెన్​                         రూ. 92 వేలు    ప్రభుత్వ ట్రైనింగ్ సెంటర్ నుంచి సంబంధిత విభాగంలో స్కిల్ సర్టిఫికెట్