వీడియో: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడి.. 12మందికి గాయాలు

V6 Velugu Posted on Nov 19, 2020

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. భద్రతా దళాలను టార్గెట్ చేసి గ్రెనేడ్ దాడికి తెగబడ్డారు. బుధవారం పుల్వామాలోని కాకాపోరా చౌక్ సమీపంలో గుర్తు తెలియని ఉగ్రవాదులు గ్రెనేడ్ విసిరారు. అయితే ఆ గ్రెనేడ్ భద్రతా దళాల మీద కాకుండా జనసంచారం ఉన్న రోడ్డుపై పడింది. దాంతో 12 మంది పౌరులు గాయపడ్డారు. ఈ దాడిలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) సిబ్బంది ఎవరూ గాయపడలేదని ఒక ఉన్నతాధికారి తెలిపారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గ్రెనేడ్ దాడి జరగడంతో భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.

కాగా.. జమ్మూలోని నాగ్రోటాలోని బాన్ టోల్ ప్లాజా సమీపంలో గురువారం ఉదయం ఎన్‌కౌంటర్ ప్రారంభం అయింది. భద్రతా దళాలు మరియు ఉగ్రవాదులకు మధ్య కాల్సులు జరుగుతుండటంతో అధికారులు జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిని మూసివేశారు.

For More News..

సిట్టింగ్‌లకే టీఆర్ఎస్ టికెట్లు

Tagged TERRORISTS, CRPF, pulwama, jammukashmir, Grenade attack

Latest Videos

Subscribe Now

More News