అది దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోని గురుగ్రామ్ ఏరియా. 29 ఏళ్ల వ్యక్తి. త్వరలో పెళ్లికి అంతా రెడీ అయ్యింది. ఢిల్లీలోని క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం.. మంచి జీతం.. మంచి జీవితం.. గురుగ్రామ్ లో ఓ అపార్ట్ మెంట్ ప్లాట్ ఉన్నాయి. జీవితం హ్యాపీ.. ఈ హ్యాపీని మరింత హ్యాపీ చేసుకోవాలని భావించాడు. త్వరలో పెళ్లి చేసుకోబోయే భార్యను.. తన ప్లాట్ కు ఆహ్వానించాడు.. ఆమె ఓకే అన్నది.. ఆ తర్వాత జరిగిన పరిణామాలు తీవ్ర విషాదంగా మారాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..
మహారాష్ట్ర నాగ్ పూర్ కు చెందిన 29 ఏళ్ల వ్యక్తికి ఢిల్లీలో ఉండే ఓ అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయ్యింది. ఆమెను తన అపార్ట్ మెంట్ ప్లాట్ కు ఆహ్వానించాడు. ఆమె వస్తానని చెప్పింది. ఈలోపు ఆ వ్యక్తి.. లైంగిక సామర్థ్యం పెంచే.. వయాగ్రా లాంటి ట్యాబ్లెట్లను తీసుకున్నాడు. ఆమె కోసం వెయిటింగ్. ఈలోపు అతని ఆఫీస్ కొలీగ్ కాల్ చేశాడు.. ఆఫీసుకు వస్తున్నాడా లేదా అని తెలుసుకోవటం కోసం.. చాలాసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. రెగ్యులర్ గా అయితే వెంటనే కాల్ లిఫ్ట్ చేస్తాడు.. లేదా తిరిగి చేస్తాడు. ఎంత సేపటికీ ఫోన్ కాల్ లిఫ్ట్ చేయకపోయే సరికి.. నేరుగా ప్లాట్ దగ్గరకు వచ్చాడు. డోర్ లోపలి నుంచి క్లోజ్ అయ్యింది. ఎంత కొట్టినా తీయలేదు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
పోలీసులతోపాటు చుట్టుపక్కల వాళ్ల సాయంతో తలుపులు పగలగొట్టి చూశారు. మంచంపై విగతజీవిగా పడి ఉన్నాడు. డాక్టర్లు వచ్చారు. చనిపోయాడు అని చెప్పారు. మంచం పక్కనే.. టేబుల్ పై లైంగిక సామర్థ్యానికి ఉపయోగించే వయాగ్రా లాంటి ట్యాబ్లెట్లు ఉన్నాయి. వాటిని అధిక మోతాదులో తీసుకోవటం వల్ల.. గుండెపోటుతో చనిపోయాడని పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు.
►ALSO READ | రాఘవ్ చద్దా హీరో కాదు జీరో.. బీజేపీలో చేరికపై జెన్‌జెడ్ ఫాలోవర్ల ఆగ్రహం..
ప్లాట్ కు వస్తానన్న కాబోయే భార్య.. అతను చనిపోయిన తర్వాత ప్లాట్ దగ్గరకు వచ్చింది. విషయం తెలిసి ఆమె షాక్.. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయింది.
కాబోయే భార్యతో మరింత హ్యాపీగా ఉండాలన్న ఆతృత, ఆవేశం అతని జీవితాన్ని ముగించేసింది. లైంగిక సామర్థ్యం కోసం ఉపయోగించే మందుల విషయంలో అప్రమత్తంగా.. జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు చెబుతున్నారు.
కొన్ని రోజుల క్రితమే గురుగ్రామ్ ఏరియాలో లైంగిక సామర్థ్యం కోసం ఉపయోగించే నకిలీ ఇంజెక్షన్ల ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ ముఠా నుంచే ఈ చనిపోయిన వ్యక్తి వాటిని కొనుగోలు చేశాడా అనే కోణంలో విచారణ చేస్తున్నారు పోలీసులు.

