జీఎస్టీ వసూళ్లు రూ.2 లక్షల కోట్లు

జీఎస్టీ వసూళ్లు రూ.2 లక్షల కోట్లు

న్యూఢిల్లీ: స్థూల జీఎస్​టీ వసూళ్ల విలువ గత నెల 8.8 శాతం వృద్ధి చెంది రూ.రెండు లక్షల కోట్లు దాటింది. దేశీయ అమ్మకాలు, దిగుమతుల నుంచి వచ్చిన పన్నుల ఆదాయం ఇందుకు తోడ్పడింది. గతేడాది మార్చిలో ఈ వసూళ్ల విలువ రూ.1.83 లక్షల కోట్లుగా నమోదయింది. 

దేశీయ ఆదాయం 5.9 శాతం పెరిగి రూ.1.46 లక్షల కోట్లు దాటగా.. దిగుమతుల ద్వారా వచ్చే ఆదాయం 17.8 శాతం వృద్ధితో రూ.53,861 కోట్లుగా ఉంది. రీఫండ్ల చెల్లింపుల తర్వాత నికర జీఎస్​టీ ఆదాయం రూ.1.78 లక్షల కోట్లు ఉంది.