నాంపల్లి ఇంటర్మీడియట్ బోర్డు దగ్గర గెస్ట్ లెక్చరర్స్ ఆందోళన

నాంపల్లి ఇంటర్మీడియట్ బోర్డు దగ్గర గెస్ట్ లెక్చరర్స్ ఆందోళన

హైదరాబాద్ నాంపల్లి ఇంటర్మీడియట్ బోర్డ్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. గెస్ట్ లెక్చరర్స్ ఆందోళన చేపట్టారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ విద్యా సంవత్సరం కొనసాగింపుగా...రెన్యూవల్ జీవో రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నారు. అలాగే మహిళ ఉద్యోగులకు ప్రత్యేక సెలవులు ఇవ్వాలన్నారు. 

గత పదేండ్లుగా విద్యార్థులకు విద్యను అందిస్తూ..విద్యావ్యవస్థలో అనేక మార్పులు తెచ్చామన్నారు గెస్ట్ లెక్చరర్లు. ఆందోళనకారులను అడ్డుకునేందుకు...ముందు జాగ్రత్తగా భారీగా పోలీసులు మోహరించారు.