
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యింది. నోటిఫికేషన్ ఈ నెల 5వతేదీన రిలీజ్ చేయనున్నట్లు సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. రెండు విడతల్లో గుజరాత్ ఎలక్షన్స్ జరుగనున్నట్లు స్పష్టం చేశారు. డిసెంబర్ 1,5 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయని, 8వ తేదీన ఫలితాలు వెల్లడిస్తామని ప్రకటించారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల వివరాలు:
రెండు విడతల్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు
మొదటి దశఎన్నిక : డిసెంబర్ 1
రెండవ దశ ఎన్నిక : డిసెంబర్ 5
డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు
మొత్తం నియోజకవర్గాలు: 182
జనరల్ స్థానాలు: 142
ఎస్సీ రిజర్వ్డ్:: 13
ఎస్టీ రిజర్వ్డ్: 27
మొత్తం పోలింగ్ స్టేషన్లు: 51,782
మొత్తం ఓటర్లు: 4.90 crore
మగవారు: 2.53 crore
స్త్రీలు: 2.37 crore
ట్రాన్స్ జెండర్స్: 1,417
గుజరాత్ లో18 ఫిబ్రవరి, 2023 తో ప్రస్తుత అసెంబ్లీ కాలపరిమితి ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. రెండు దశల్లో జరగనున్న పోలింగ్ కు ఈ నెల 5న నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. అయితే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల కోసం 51,000 పోలింగ్ బూతులు ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. కొత్త ఓటర్ల నమోదుకు ఏడాదిలో 4 పర్యాయాలు కసరత్తు చేసిన అధికారులు.. దేశంలోనే మొదటిసారిగా షిప్పింగ్ కంటైనర్లో పోలింగ్ బూత్ ఏర్పాటు చేయనున్నారు. 217 మంది ఓటర్ల కోసం కంటైనర్ పోలింగ్ బూత్ ఏర్పాటు చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు.కంటైనర్ బూత్‌లో ఉండే అన్ని సదుపాయాలు కల్పిస్తామని... ఒక్క ఓటరు కోసం గిర్ అటవీ ప్రాంతంలో ఒక పోలింగ్ బూత్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. 33 జిల్లాల పరిధిలో అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా.. గుజరాత్ , హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ప్రత్యేక ఎన్నికల పరిశీలకులుంటారని చెప్పారు. కాగా ప్రస్తుతం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగా ఓటుహక్కు వినియోగించుకోనున్న ఓటర్ల సంఖ్య 11 లక్షల 62 వేలు. ఈ క్రమంలో యువ ఓటర్లకోసం ప్రత్యేక పోలింగ్ బూతులు ఏర్పాటు చేయనున్నారు. ఇదిలా ఉండగా 2017 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ99 , కాంగ్రెస్ 77 స్థానాలను దక్కించుకున్నాయి.