గుజరాత్ విజయాల పరంపర కొనసాగుతోంది. ఐపీఎల్ ఆరంభంలో కాస్త వెనకబడినట్లు కనిపించినా.. అనూహ్యంగా పుంజుకుంది. 2026 మే 09న జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ 77 రన్స్ తో ఓడించి పంజాబ్, బెంగళూర్ ను వెనక్కి నెట్టి 14 పాయింట్లతో రెండవ స్థానంలోకి చేరుకుంది. గుజరాత్ కు ఇది వరుసగా 4వ గెలుపు.
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన గుజరాత్.. నిర్ణీత 20 ఓవర్లలో ఇచ్చిన 230 రన్స్ టార్గెట్ ను కాపాడుకుంది. బౌలర్లు చెలరేగటంతో రాజస్థాన్ టాపార్డర్ కుప్పకూలింది. ముఖ్యంగా రషీద్ ఖాన్ 4 వికెట్లు, హోల్డర్ 3, రబాడా రెండు వికెట్లతో రాజస్థాన్ భరతం పట్టారు. సిరాజ్ ఒక కీలక వికెట్ తీశాడు.
ఇక గుజరాత్ ఇచ్చిన 230 రన్స్ టార్గెట్ ను ఛేదించే క్రమంలో ఆరంభం నుంచే వికెట్లను సమర్పించుకుంది రాజస్థాన్. హోమ్ గ్రౌండ్లో.. పింక్ ప్రామిస్ లో భాగంగా మ్యాజిక్ చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ బ్యాటర్లు క్రీజులో ఎక్కువ సేపు నిలవలేక పోవడంతో మరో ఓటమిని కొనితెచ్చుకున్నారు.
రాజస్థాన్ బ్యాటర్లలో రవీంద్ర జడేజా 38 ( 25 బాల్స్, 3 ఫోర్లు, 2 సిక్సులు), వైభవ్ సూర్యవంశీ 36 (16 బాల్స్, 3 ఫోర్లు, 3 సిక్సులు), ధృవ్ జురెల్ 24 (10 బాల్స్, 1 ఫోర్, 3 సిక్సులు) రాణించినా భారీ స్కో్ర్ ఎవరూ చేయలేక పోయారు. పెద్దగా పాట్నర్షిప్ లు నమోదు కాకపోవడంతో.. కీలక మ్యాచ్ లో రాజస్థాన్ ఓడిపోవాల్సి వచ్చింది.
గుజరాత్ ఓపెనర్లు రప్పా రప్పా..
అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన గుజరాత్ బ్యాటర్లు రప్పా రప్పా విరుచుకుపడ్డారు. ఓపెనర్లు ఇద్దరూ హాఫ్ సెంచరీలు చేశారంటే ఎలా ఆడారో ఊహించవచ్చు. ఓపెనర్లు ఇచ్చిన పాట్నర్ షిప్ తో రాజస్థాన్ ముందు 230 రన్స్ టార్గెట్ ఉంచింది గుజరాత్.
గుజరాత్ ఓపెనర్లలో గిల్ 44 బంతులలో 9 ఫోర్లు, 3 సిక్సులతో 84 రన్స్ తో విరుచుకుపడ్డాడు. 17వ ఓవర్లో బ్రిజేష్ శర్మ బౌలింగ్ లో ఔటయ్యాడు. అంతకు ముందు మరో ఓపెనర్ సాయి సుదర్శన్ 36 బంతులలో 6 సిక్సులు, 2 ఫోర్లతో 55 రన్స్ చేసి.. ఇద్దరి పాట్నర్షిప్ తో గుజరాత్ స్కో్ర్ పరుగులు తీసేలా కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. 11వ ఓవర్ లో యశ్ రాజ్ పుంజా బౌలింగ్ లో ఔటయ్యాడు.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జోస్ బట్లర్ ఎక్కువ సేపు నిలవలేక పోయాడు. 10 బాల్స్ ఆడి 13 రన్స్ తో జడేజా కు దొరికిపోయాడు. గిల్ తర్వాత వచ్చిన హోల్డర్ (7) అంతగా ఇంపాక్ట్ చూపలేకపోయాడు. 19వ ఓవర్ లో బ్రిజేశ్ శర్మ బౌలింగ్ లో జైశ్వాల్ కు క్యాచ్ ఇచ్చి
చివర్లో రాహుల్ తెవాటియా, వాషింగ్టన్ సుందర్ మెరుపులు మెరిపించడంతో గుజరాత్ కు మరింత స్కోర్ యాడ్ అయ్యింది. సుందర్ 21 బాల్స్ లో 2 ఫోర్లు, 3 సిక్సులతో 37 రన్స్ చేయగా.. తెవాటియా 4 బంతులలో 2 సిక్సులతో 14 రన్స్ చేశాడు.
రాజస్థాన్ బౌలర్లలో బ్రిజేష్ శర్మ 2 వికెట్లు తీసుకోగా, రవీంద్ర జడేజా, యశ్ రాజ్ పుంజా ఒక్కో వికెట్ తీసుకున్నారు. 19వ ఓవర్ వేసిన బ్రిజేష్ హోల్డర్ ను ఔట్ చేయడమే కాకుండా.. 3 డాట్ బాల్స్ వేసి కేవలం 4 రన్స్ మాత్రమే ఇచ్చాడు.
