మాజీ చాంపియన్ గుజరాత్ టైటాన్స్(జీటీ) మెగా లీగ్‌లో వరుసగా రెండో విజయం అందుకుంది. పేసర్ ప్రసిధ్ కృష్ణ (4/24) ఖతర్నాక్ బౌలింగ్‌తో లక్నో సూపర్ జెయింట్స్ ఏడు వికెట్ల తేడాతో ఓడింది. ఆదివారం మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో ఫస్ట్బ్యాటింగ్చేసిన లక్నో 20 ఓవర్లలో 164/8 స్కోరు చేసింది. తర్వాత జీటీ18.4 ఓవర్లలో 163/3 స్కోరు చేసి గెలిచింది.
లక్నో: రెండు ఓటములతో ఐపీఎల్19వ సీజన్‌ను ఆరంభించిన మాజీ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ మెగా లీగ్‌లో వరుసగా రెండో విజయం అందుకుంది. సొంతగడ్డపై చెత్తాటను కొనసాగించిన లక్నో సూపర్ జెయింట్స్ మళ్లీ ఓడింది. పేసర్ ప్రసిధ్ కృష్ణ (4/24) ఖతర్నాక్ బౌలింగ్‌తో బ్యాటర్లను బెంబేలెత్తించిన వేళ జోస్ బట్లర్ (37 బాల్స్‌లో 11 ఫోర్లతో 60), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (40 బాల్స్‌లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 56) ఫిఫ్టీలతో మెరవడంతో ఆదివారం మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో జీటీ 7 వికెట్ల తేడాతో లక్నోపై ఘన విజయం సాధించింది. తొలుత లక్నో 20 ఓవర్లలో 164/8 స్కోరు మాత్రమే చేసింది. ఐడెన్ మార్‌క్రమ్ (21 బాల్స్‌లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 30) టాప్ స్కోరర్. అశోక్ శర్మ (2/32) రెండు వికెట్లు పడగొట్టాడు. తర్వాత జీటీ18.4 ఓవర్లలో 165/3 స్కోరు చేసి ఈజీగా గెలిచింది. ప్రసిధ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
- ప్రసిధ్ దెబ్బ
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన లక్నోకు ఆరంభం నుంచే కష్టాలు మొదలయ్యాయి. ఓపెనర్ మార్‌క్రమ్ స్కోరు బోర్డును పరిగెత్తించే ప్రయత్నం చేసినా, అతనికి ఇతర బ్యాటర్ల నుంచి సహకారం లభించలేదు. మిచెల్ మార్ష్ (11) ఓ సిక్స్, ఫోర్ కొట్టి రబాడ బౌలింగ్‌లో వెనుదిరగ్గా, కెప్టెన్ రిషబ్ పంత్ (18) సిరాజ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటవడంతో పవర్‌ప్లేను లక్నో 60/2తో ముగిచింది. ఫీల్డింగ్ మారిన తర్వాత ప్రసిధ్ కృష్ణ బౌలింగ్‌కు దిగడంతో లక్నో కష్టాలు రెట్టింపయ్యాయి. క్రీజులో కుదురుకున్న మార్‌క్రమ్‌ను వెనక్కుపంపి చేసి షాకిచ్చిన ప్రసిధ్ ఆ తర్వాత ఆయుష్ బదోనీ(9) పని పట్టాడు. అశోక్ శర్మ, రషీద్ ఖాన్ కూడా పొదుపుగా బౌలింగ్ చేశారు.
రబాడ బౌలింగ్‌లో అబ్దుల్ సమద్ (18) రెండు ఫోర్లు, రషీద్ వేసిన 14వ ఓవర్లో నికోలస్ పూరన్ (19) రెండు సిక్సర్లు కొటి వేగంపెంచే ప్రయత్నం చేశారు. కానీ, స్లో షార్ట్ బాల్‌తో పూరన్‌ను ఔట్ చేసిన ప్రసిధ్ ప్రత్యర్థికి అడ్డుకట్ట వేయగా.. సమద్‌ను అశోక్ శర్మ వెనక్కుపంపాడు. గత మ్యాచ్‌లో మెరిసిన ముకుల్ చౌదరి (18) ఈసారి తక్కువ స్కోరుకే పరిమితమయ్యాడు. ఆఖర్లో జార్జ్ లిండే (16), షమీ (12 నాటౌట్) మెరుపులతో లక్నో 160 మార్కును దాటింది.
- గుజరాత్ అలవోకగా..
ఛేజింగ్‌లో టైటాన్స్‌కు ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ (15) మంచి ఆరంభాన్ని ఇచ్చారు. తొలి ఓవర్లోనే సుదర్శన్ రెండు ఫోర్లు కొట్టగా.. షమీ వేసిన ఐదో ఓవర్లో గిల్ వరుసగా 4, 6, 4, 4 తో విజృంభించాడు. తొలి వికెట్‌కు 45 రన్స్ జోడించిన తర్వాత సుదర్శన్ ఔట్ అయినప్పటికీ బట్లర్ క్రీజులోకి రావడంతో ఆట స్వరూపమే మారిపోయింది. 12 రన్స్ వద్ద తన క్యాచ్‌ను లక్నో కీపర్ పంత్ డ్రాప్ చేయడంతో వచ్చిన చాన్స్‌ను బట్లర్ సద్వినియోగం చేసుకున్నాడు.
ఓవైపు గిల్.. మరో ఎండ్‌లో బట్లర్ వరుస బౌండరీలు కొట్టడంతో టార్గెట్ కరిగిపోయింది. గిల్ 34 బాల్స్‌లో ఫిఫ్టీ పూర్తి చేసుకోగా.. బట్లర్ 29 బాల్స్‌లో ఈ మార్కు దాటాడు. రెండో వికెట్‌కు 84 రన్స్ జతైన తర్వాత వరుస ఓవర్లలో ఈ ఇద్దరినీ ఔట్ చేసిన లక్నో రేసులోకి వస్తుందనిపించింది. కానీ, సుందర్ (21 నాటౌట్), తెవాటియా (10 నాటౌట్) ఆ జట్టుకు ఎలాంటి చాన్స్ ఇవ్వకుండా మరో 8 బాల్స్ ఉండగానే మ్యాచ్ ముగించారు.
సంక్షిప్త స్కోర్లు
లక్నో: 20 ఓవర్లో 164/8 (మార్‌క్రమ్ 30, పూరన్ 19, ప్రసిధ్ 4/28).
గుజరాత్: 18.4 ఓవర్లలో 165/3 (బట్లర్ 60, గిల్ 56, దిగ్వేశ్ 1/31).
100 టీ20 ఫార్మాట్‌లో జోస్ బట్లర్ వంద ఫిఫ్టీలు పూర్తి చేశాడు.
