చిన్నారుల అక్రమ రవాణా కేసులో గుజరాత్ పోలీసులు మరోసారి హైదరాబాద్ లో సోదాలు నిర్వహించారు. 2026 ఏప్రిల్ 30వ తేదీన హైదరాబాద్ లోని మూడు ప్రముఖ ఐవీఎఫ్ కేంద్రాలలో సోదాలు చేశారు. ఈ కేసులో మూడేళ్ల పాటు జైళ్లో ఉండి వచ్చిన కింగ్ పిన్ మురుగన్ నుఅరెస్టు చేసిన గుజరాత్ పోలీసులు.. హైదరాబాద్ లో సోదాలు చేయడం హాట్ టాపిక్ గా మారింది.
మురుగన్ తో సంబంధాలున్న హైదరాబాద్ లోని మూడు ఫెర్టిలిటీ సెంటర్లలో సోదాలు చేశారు గుజరాత్ పోలీసులు. సికింద్రాబాద్ లోని ఫర్టీ9 ఐవీఎఫ్, బంజారా హిల్స్ లోని హెగ్డే ఐవీఎఫ్, కూకట్ పల్లిలో ఉన్న నోవా ఐవీఎఫ్ సెంటర్లలో సోదాలు జరిపారు.
చిన్నారుల అక్రమ రవాణా కేసులో గత ఏడాది చైతన్యపురి కేసులో మురుగన్ పేరు వెలుగులోకి వచ్చింది. ఏడాదిలోనే కింగ్ పిన్ గా మారిన మురుగన్ .. మూడు నెలల పాటు జైల్లో ఉండి బయటికి వచ్చాడు. దేశవ్యాప్తంగా పెద్ద నెట్వర్క్ ఏర్పర్చుకుని ఒక్క ఏడాదిలోనే 25 మంది చిన్నారుల విక్రయాలు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం మురుగన్ గ్యాంగ్ గుజరాత్ పోలీసుల అదుపులో ఉంది.
అయితే ఇటీవల సికింద్రాబాద్ ఫర్టీ 9 లో ఎటువంటి తనిఖీలు జరగలేదని నిర్వాహకులు చెప్తున్నారు. సికింద్రాబాద్ కు సంబంధించి తమకు ఎటువంటి సమాచారం లేదని సిబ్బంది చెప్తున్నారు.

