పతివ్రతవే ఐతే.. మరిగే నూనెలో చేతులు పెట్టు

పతివ్రతవే ఐతే.. మరిగే నూనెలో చేతులు పెట్టు
  • 30 ఏండ్ల మహిళపై భర్త, ఆడపడుచు అమానుషం

గాంధీనగర్: పతివ్రతగా నిరూపించుకోవాలంటూ భార్యను మరిగే నూనెలో చేతులు పెట్టించారు. భర్త, ఆడపడుచు కలిసి ఈ దారుణానికి పాల్పడ్డారు. తీవ్రగాయాలతో బాధితురాలు ఆస్పత్రిపాలైంది. గుజరాత్‌లోని మెహసానా జిల్లాలో ఇటీవల జరిగిన ఈ దారుణానికి సంబంధించిన వీడియో ఆదివారం బయటపడింది. విజాపూర్‌ ‌తాలూకాకు చెందిన 30 ఏండ్ల మహిళను ఆమె భర్త, ఆడపడుచు అనుమానించారు.

ఎవరితోనూ అక్రమ సంబంధం లేదని, పతివ్రత అని నిరూపించుకోవాలని ఆమెను డిమాండ్‌ చేశారు. మరుగుతున్న నూనెలో చేతులు పెట్టాలని, నిజంగా నమ్మకమైన బార్యే అయితే ఎలాంటి గాయాలుకావంటూ పరీక్షకు సిద్ధమయ్యారు. నూనె మరుగుతుండగా ఆమెను చేతులుపెట్టాలని బెదిరించారు. దీంతో ఆమె తన చేతి వేళ్లను నూనెలో ముంచి, వెంటనే బయటకు తీసింది. క్షణాల్లోనే వేళ్లకు తీవ్రగాయాలవడంతో ఆస్పత్రికి వెళ్లింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు.. ఆమె భర్త, ఆడపడుచు, మరో ఇద్దరిని అరెస్ట్‌ చేశారు.