టాటా స్టీల్‌‌‌‌ చెస్‌‌‌‌ టోర్నీలో ప్రజ్ఞానంద గేమ్‌‌‌‌ డ్రా

టాటా స్టీల్‌‌‌‌ చెస్‌‌‌‌ టోర్నీలో ప్రజ్ఞానంద గేమ్‌‌‌‌ డ్రా

విజ్క్‌‌‌‌ ఆన్‌‌‌‌ జీ (నెదర్లాండ్స్‌‌‌‌): ఇండియా గ్రాండ్‌‌‌‌ మాస్టర్‌‌‌‌ ఆర్‌‌‌‌. ప్రజ్ఞానంద.. టాటా స్టీల్‌‌‌‌ చెస్‌‌‌‌ టోర్నీలో రెండో డ్రా నమోదు చేశాడు. మంగళవారం డి. గుకేశ్‌‌‌‌తో జరిగిన నాలుగో రౌండ్‌‌‌‌ గేమ్‌‌‌‌ను ప్రజ్ఞానంద డ్రాగా ముగించాడు. దీంతో ఇద్దరు పాయింట్‌‌‌‌ను పంచుకున్నారు. 

ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన ప్రజ్ఞానందను మధ్యలో గుకేశ్‌‌‌‌ కీలక ఎత్తులతో అడ్డుకున్నాడు. చివరకు ఫలితం తేలే చాన్స్‌‌‌‌ లేకపోవడంతో ఇద్దరూ డ్రాకు అంగీకరించారు. ఇతర గేమ్‌‌‌‌ల్లో అరవింద్‌‌‌‌ చిదంబరం.. నీమాన్‌‌‌‌ హాన్స్‌‌‌‌ మోక్‌‌‌‌ చేతిలో ఓడగా, నొడిర్బెక్‌‌‌‌ అబ్దుసత్తారోవ్‌‌‌‌.. ఎన్గుయెన్‌‌‌‌ థాయ్‌‌‌‌ డాయ్‌‌‌‌ వాన్‌‌‌‌పై, సికిందర్‌‌‌‌ జావోకిర్‌‌‌‌.. మథియాస్‌‌‌‌పై నెగ్గారు. వ్లాడిమిర్‌‌‌‌ ఫిడోసెవ్‌‌‌‌.. వాన్‌‌‌‌ ఫోరెస్ట్‌‌‌‌, యాజిజ్‌‌‌‌ ఖాన్‌‌‌‌.. కీమర్‌‌‌‌ విన్సెంట్‌‌‌‌ మధ్య జరిగిన గేమ్‌‌‌‌లు డ్రా అయ్యాయి.