కోనరావుపేట: స్వగ్రామానికి చేరిన వలసజీవి డెడ్బాడీ

కోనరావుపేట: స్వగ్రామానికి చేరిన  వలసజీవి డెడ్బాడీ

కోనరావుపేట, వెలుగు: గల్ఫ్ లో గుండె పోటుతో చనిపోయిన వలస జీవి డెడ్​బాడీ గురువారం స్వగ్రామానికి చేరుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన ఆసరి వెంకటేశ్వర్లు అలియాస్  మొండయ్య(40) మూడేళ్ల కింద ఒమన్  దేశానికి వెళ్లాడు. వీసా గడువు ముగిసినప్పటికీ అక్కడే ఉంటూ పని చేసుకుంటుండగా, పోలీసులకు పట్టుబడ్డాడు. 

దీంతో గత నెల 25న గుండెపోటుతో చనిపోయాడు. అప్పటి నుంచి డెడ్​బాడీ కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూశారు. మృతుడికి భార్య పుష్పలత, ఇద్దరు కొడుకులు మనోజ్, అజయ్  ఉన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఎక్స్​గ్రేషియా అందించి ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.