ఆస్కార్‌ కు ఎంపికైన గల్లీ బాయ్

ఆస్కార్‌ కు ఎంపికైన గల్లీ బాయ్

27 సినిమాలను దాటుకుని గల్లీబాయ్ ఆస్కార్ ఎంట్రీ కొట్టేసిం ది. 92వ అకాడమీ అవార్డ్స్ లో ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీ కింద ఎంపికైంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన ఈ సినిమాలో రణ్ వీర్ సింగ్ , అలియా భట్ హీరో హీరోయిన్లుగా నటించారు. జోయా అక్తర్ డైరెక్ట్​ చేశారు. ‘‘ఇండియా నుంచి అధికారికంగా ఆస్కార్ కు గల్లీబాయ్ ఎంపికైంది. ఈ ఏడాది 28 సినిమాలు ఆస్కార్ కు పోటీపడ్డాయి. అందరూ గల్లీబాయ్ ను ఏకగ్రీవంగా ఆస్కార్ కు నామినేట్ చేశారు” అని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సెక్రటరీ జనరల్ సుప్రన్ సేన్ తెలిపారు. విజయ్‌‌ దేవరకొం డ హీరోగా నటించిన ‘డియర్ కామ్రేడ్’ కూడా ఆస్కార్ ఎంట్రీ కోసం పోటీ పడిం ది. మొత్తం 28 సినిమాల్లో తెలుగు చిత్రం ఇదొక్కటే కావడం విశేషం.