యోగాతో ఆరోగ్యం : కలెక్టర్ సత్యశారద

యోగాతో ఆరోగ్యం : కలెక్టర్ సత్యశారద

ఖిలా వరంగల్ (మామునూరు)/ జనగామ అర్బన్, వెలుగు : యోగాతో ఆరోగ్యంగా ఉండవచ్చని వరంగల్​ కలెక్టర్​ సత్యశారద అన్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం ఖిలా వరంగల్, జనగామ ధర్మకంచ మినీ స్టేడియంలో ప్రపంచ హోమియోపతి దినోత్సవం, ఆయూష్​దినోత్సవాలను నిర్వహించారు. వరంగల్​లో పాల్గొన్న కలెక్టర్ అడిషనల్​కలెక్టర్​ సంధ్యారాణి, డీఎంహెచ్​వో సాంబశివరావుతో కలిసి యోగాసనాలు వేశారు. జనగామలో డీఎంహెచ్​వో మల్లికార్జునరావు, జీజీహెచ్​ సూపరింటెండెంట్​ రాజలింగం, ఆఫీసర్లు పాల్గొని యోగా చేశారు.