భీమేశ్వర స్వామిసేవలో నటుడు సాయి ధరమ్ తేజ్

భీమేశ్వర స్వామిసేవలో నటుడు సాయి ధరమ్ తేజ్

వేములవాడ/కొండగట్టు, వెలుగు: వేములవాడ భీమేశ్వర స్వామివారిని ప్రముఖ సినీ నటుడు సాయి ధరమ్ తేజ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కోడె మొక్కు చెల్లించుకున్నారు. ఆలయ పర్యవేక్షకుడు శ్రీనివాస్  శర్మ శేషవస్త్రం కప్పి లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్నను దర్శించుకున్నారు. తాను నటించిన సంబరాల ఏటిగట్టు సినిమా త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నట్లు తెలిపారు.