కార్ లవర్స్‌కు పండగే: 2026లో వోక్స్‌వ్యాగన్ నుంచి వస్తున్న టాప్-19 కార్ మోడళ్లు ఇవే..

కార్ లవర్స్‌కు పండగే: 2026లో వోక్స్‌వ్యాగన్ నుంచి వస్తున్న టాప్-19 కార్ మోడళ్లు ఇవే..

భారతీయ రోడ్లపై జర్మన్ ఇంజనీరింగ్ పవర్ పెరగబోతోంది. స్కోడా ఆటో వోక్స్‌వ్యాగన్ ఇండియా 2026లో ఏకంగా 19 కొత్త కార్లతో ఇండియన్ ఆటో మార్కెట్‌ను షేక్ చేయడానికి రెడీ అయిపోయింది. స్కోడా, వోక్స్‌వ్యాగన్, ఆడి, బెంట్లీ, లంబోర్గిని, పోర్షే.. ఇలా గ్రూప్‌లోని 6 బ్రాండ్లు కలిసి ఒకే ఏడాదిలో ఇన్ని లాంచ్‌లు ప్లాన్ చేయడం కార్ లవర్స్‌కు నిజంగా పండగే అని చెప్పాలి. కేవలం అప్‌డేట్లు మాత్రమే కాదు.. సరికొత్త మోడళ్లు, ఎలక్ట్రిక్ కార్లు కూడా ఈ లిస్టులో చేరాయి.

వోక్స్‌వ్యాగన్ నుంచి 4 మోడల్స్..
వోక్స్‌వ్యాగన్ ఇండియా ఈ ఏడాది కనీసం నాలుగు మేజర్ లాంచ్‌లను కన్ఫర్మ్ చేసింది. ఇందులో అందరినీ ఊరిస్తున్న హాట్ హ్యాచ్‌బ్యాక్ 'గోల్ఫ్ GTI' అదనపు యూనిట్లతో పాటు, సరికొత్త 'టేరాన్' లోయర్ స్పెక్ వెర్షన్ వచ్చేస్తోంది. అయితే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కువగా ఎదురుచూస్తున్న వర్టస్ ఫేస్‌లిఫ్ట్, తైగన్ ఫేస్‌లిఫ్ట్ కూడా ఈ ఏడాదే సందడి చేయబోతున్నాయి. సబ్-4 మీటర్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌పై కూడా వోక్స్‌వ్యాగన్ కన్నేసింది. ఎందుకంటే మార్కెట్‌లో 30 శాతం వాటా ఆ సెగ్మెంట్‌దే.

లగ్జరీ సెగ్మెంట్‌లో ఆడి, స్కోడా హవా
లగ్జరీ కార్ల సెగ్మెంట్‌లో ఆడి తన ప్రతాపం చూపించబోతోంది. కొత్త క్యూ3, ఏ6 ఈ-ట్రాన్ , ఈ-ట్రాన్ జీటీ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లను ఇండియాకు తీసుకురావడానికి రంగం సిద్ధమైంది. అటు స్కోడా బ్రాండ్ నుంచి స్టైలిష్ సెడాన్ 'స్లావియా' ఫేస్‌లిఫ్ట్ రాబోతోంది. దీనితో పాటు ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లోకి 'ఎల్రోక్' ఎంట్రీ ఇస్తుండటం విశేషం. ఇంపోర్టెడ్ యూనిట్లు మాత్రమే కాకుండా.. లోకల్‌గా తయారు చేసే కార్ల విషయంలో కూడా కంపెనీ డబుల్ డిజిట్ గ్రోత్‌ను టార్గెట్ చేస్తోంది 2026 కోసం.

FTA సస్పెన్స్.. కస్టమర్ల వెయిటింగ్
ప్రస్తుతం విదేశాల నుంచి వచ్చే ఇంపోర్టెడ్ కార్ల విషయంలో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్(FTA) చర్చలు జరుగుతున్నాయి. దీనివల్ల పన్నులు తగ్గి కార్ల ధరలు తగ్గుతాయేమో అని కొంతమంది కస్టమర్లు వెయిట్ అండ్ వాచ్ ఫాలో అవుతున్నారు. దీనివల్ల షార్ట్ టర్మ్ డిమాండ్‌పై కొంచెం ప్రభావం పడినా.. లాంగ్ టర్మ్‌లో మరిన్ని గ్లోబల్ మోడల్స్ ఇండియాలోకి తక్కువ ధరకే వచ్చే అవకాశం ఉందని కంపెనీ ఎండీ పీయూష్ అరోరా అన్నారు.

►ALSO READ | అక్షయ తృతీయ వచ్చేస్తోంది.. ఆ రోజుకు పురాణాల్లో ఉన్న విశిష్టత ఏంటీ.. మెరిసేదంతా బంగారం కాదు జాగ్రత్త..!

ఏడాది ప్రారంభంలో జీఎస్టీ 2.0 ప్రభావంతో కార్ల అమ్మకాలు జోరుగా సాగాయి. మొదటి త్రైమాసికంలో డబుల్ డిజిట్ గ్రోత్ నమోదైనప్పటికీ.. పశ్చిమ ఆసియాలో జరుగుతున్న యుద్ధం ఆటో మొబైల్ పరిశ్రమకు పెద్ద సవాల్‌గా మారింది. రవాణా ఖర్చులు, సప్లై చైన్ సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నప్పటికీ.. తన 19 ప్రాడక్ట్ లాంచ్‌లతో మార్కెట్‌ను డామినేట్ చేయాలని జర్మన్ జెయింట్ ప్లాన్ చేస్తోంది.