మేడ్చల్ జిల్లా పోచారంలో కాల్పుల కలకలం

మేడ్చల్ జిల్లా పోచారంలో కాల్పుల కలకలం

మేడ్చల్‌ జిల్లా పోచారంలో కాల్పులు కలకలం సృష్టించాయి. యమ్నాంపేట కిట్ ఇండస్ట్రీ వెనకాల ఉన్న వెంచర్ లో  ప్రశాంత్ సోనూ సింగ్ అనే  వ్యక్తిపై కాల్పులు జరిపి పరారయ్యాడు ఇబ్రహీం అనే వ్యక్తి.

గాయాలైన సోనూ సింగ్ గాయాలతో వెంచర్ నుంచి బయటకు వచ్చి కింద పడిపోవడంతో  హోటల్ దగ్గర ఉన్న స్థానికులు  పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. గాయాలైన సోనూ సింగ్ ను ముందస్తుగా ఉప్పల్ శ్రీకర హాస్పిటల్ కి తరలించారు.  సోనూ సింగ్ బాడీలో రైట్ సైడ్ రిబ్స్ లో బులెట్ ఉండడంతో మళ్లీ సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ కి తరలించారు. 

ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. అసలు ఇద్దరి మధ్య గొడవ ఎందుకు జరిగింది. రియల్ ఎస్టేట్ గొడవలా  ఇంకా ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు .  రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితుడు  బహదూర్ పురాకి చెందిన రౌడీ షీటర్ ఇబ్రహీంగా గుర్తించామని..అతడి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.