V6 News

మహిళా సర్పంచుల ఫోరం రాష్ట్ర కన్వీనర్ గా గుంటిపల్లి రేణుక

మహిళా సర్పంచుల ఫోరం రాష్ట్ర కన్వీనర్ గా గుంటిపల్లి రేణుక
  • సర్పంచుల సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నిక

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర మహిళా సర్పంచుల ఫోరం కన్వీనర్ గా గుంటిపల్లి రేణుక ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం హైదరాబాద్ లోని సెక్రటేరియట్ ఆవరణలో జరిగిన మహిళా సర్పంచుల సమావేశంలో రేణుకను కన్వీనర్ గా ఎన్నుకున్నారు. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామం నుంచి రేణుక భారీ మేజార్టీతో సర్పంచ్​గా గెలుపొందారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామ పంచాయతీల్లోని సమస్యలు, మహిళలు, మహిళా సర్పంచుల ప్రాధాన్యంపై ఫోరం పనిచేస్తుందని తెలిపారు. గ్రామ పంచాయతీలు ఆర్థిక పరిపుష్టిని సాధించేందుకు ప్రభుత్వం నరుగా నిధులు విడుదల చేయాలని కోరారు. మహిళా సర్పంచుల వేతనం పెంచేలా  ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని తెలిపారు.