
జ్యోతిష్య శాస్త్రం.. నవగ్రహాలు.. 12 రాశులు.. 27 నక్షత్రాలపై ఆధారపడి ఉంటుంది. గ్రహాలకు సూర్యుడు రాజు.. అయితే గురుడు దేవతలకు అధిపతిగా వ్యవహరిస్తాడు, గురు గ్రహం సంపద.. ఆనందం విషయంలో కీలక పాత్ర పోషిస్తాడు. అలాంటి శక్తిమంతమైన గురు గ్రహ విషయంలో జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ రోజు ( జులై 9) రాత్రి 10.50 గంటలకు కీలక మార్పుజరగబోతుంది. గురుడు మిథునరాశిలో ఉదయించడం వలన 12 రాశుల వారి జాతకంలో మార్పులు జరుగుతాయి. ఇప్పుడు 12 రాశుల గురించి వివరంగా తెలుసుకుందాం..!
మేషరాశి : మిథున రాశిలో గురుడు ఉదయించడం వలన ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగస్తులు ... కార్యాలయంలో కీలక పాత్ర పోషిస్తారు. విదేశీ ప్రయాణాలు కూడా అనుకూలిస్తాయి. గతంలో ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయి. కుటుంబసభ్యుల మధ్య ఉన్న అవాంతరాలు.. అపోహలు తొలగిపోవడంతో మనశ్శాంతి ఏర్పడుతుంది. వ్యాపారస్తుల విషయంలో ఊహించని లాభాలు కలుగుతాయి. పెట్టుబడికి మూడు రెట్లు లాభం కలుగుతుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి. నిరుద్యోగులకు ఆశించిన జాబ్ లభించే అవకాశం ఉంది.
వృషభ రాశి: ఈ రాశి వారికి గురు గ్రహ బలం పెరుగుట వలన ఆర్థకపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి. గతంలో రావలసిన డబ్బు ఇప్పుడు చేతికి అందుతుంది. కుటుంబసమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగస్తులకు... వ్యాపారస్తులకు .. చేతి వృత్తుల వారికి ఆదాయం పెరుగుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడులకు ఇప్పుడు ఫలితం పొందుతారు. నిరుద్యోగులకు మంచి జాబ్ ఆఫర్ వస్తుంది. మీరు తీసుకునే నిర్ణయం లైఫ్ టర్నింగ్ పాయింట్ అవుతుంది. గురుడు మిధునరాశిలో ఉదయించడం.. ఈ రాశి వారికి అన్ని సానుకూల ఫలితాలుంటాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
మిథున రాశి : ఇదే రాశిలో గురుడు ఉదయించడం వలన మిథున రాశికి చెందిన నిరుద్యోగులకు మంచి జాక్ పాక్ తగులుతుంది. ఊహించిన దానికంటే మంచి ఉద్యోగం వస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ వస్తుంది. వ్యాపారస్తులకు ఊహించని లాభాలు కలుగుతాయి. పెళ్లి సంబంధం విషయంలో సంప్రదింపులు కొనసాగుతాయి. కుటుంబ సమస్యలు పరిష్కారం కావడంతో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిదని జ్యోతిష్యశాస్త్రం ద్వారా తెలుస్తోంది. . .
కర్కాటక రాశి : గురుడు మిథునంలో ఉదయించడం వలన ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలుంటాయి. అంచనాలకు మించి ఖర్చులు పెరుగుతాయి. ఎట్టి పరిస్థితిలో అప్పు చేయవద్దు. ఉద్యోగస్తులు మీ ప్రమేయం లేకుండా అనుమానాలకు గురయ్యే అవకాశం ఉంది. ఎవరితోనూ ఎలాంటి వాదనలకు దిగవద్దు. సాధ్యమైనంత తక్కువగా మాట్లాడండి. వ్యాపారస్తులు అధికంగా కష్టపడాల్సి వస్తుంది. ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవండి.. ఉపశమనం ఉంటుంది. ఎలాంటి ఆందోళన చెందవద్దు.. వచ్చే రోజుల్లో అంతా మంచే జరుగుతుంది.
సింహ రాశి: ఈ రాశి వారు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. విద్యార్థులకు చదువుపై ఆశక్తి పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు బలపడతాయి. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. ఆకస్మిక ధన లాభం రావడంతో కొత్తగా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆర్థిక స్థిరత్వం ఏర్పడం... ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. రియల్ ఎస్టేట్... బ్యాంకింగ్ ...వడ్డీ వ్యాపారం ..ఆర్థిక లావాదేవీలు వంటి రంగాలలో ఉన్న వారికి ఎంతగానో కలిసి వస్తుంది. ప్రయత్నాలు ఆలోచనలు, తప్పకుండా మంచి ఫలితాలను ఇస్తాయి.
కన్య రాశి : ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలుంటాయి. ఇతరులతో సంభాషించే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండకపోతే మీ పరువుపోయే అవకాశం ఉంది. వ్యాపారస్తులు కొద్దిపాటి ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కుటుంబంలో ఆర్థిక వ్యవహారాలకు సంబంధిం చిన విషయాలలో పేచీలు ప్రారంభం అవుతాయి. అధికారులతో ఆచితూచి వ్యవహరిం చాల్సిన అవసరం ఉంది. తొందరపాటు ఏమాత్రం పనికిరాదు. విభేదాలు, అపార్ధాలు తలెత్తే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.
తులా రాశి: ఈ రాశి వారు ఆధ్యాత్మిక యాత్రలే చేసే అవకాశం ఉంది. పూర్వీకుల ఆస్తి కలసి వస్తుంది. కార్యాలయంలో మీకు ఉన్నత స్థానం లభిస్తుంది. పనిభారం పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారస్తులకు పెండింగ్ పనులు పూర్తవుతాయి. వ్యక్తిగత, వృత్తిగత జీవితంలో కొనసాగుతున్న సమస్యల నుంచి బయటపడే సూచనలు ఉన్నాయి. ఎలాంటి ఇబ్బంది లేదు.. అంతా మంచే జరుగుతుంది.
వృశ్చిక రాశి: మిథునరాశిలో గురుడు ఉదయించడం వలప ఈ రాశి వారికి అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. పని ఒత్తిడి పెరుగుతుంది. వాహనం డ్రైవింగ్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. ఆర్థిక విషయాల్లో కొద్దిపాటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఇతరుల సమస్యలను మీద వేసుకొని కష్ట నష్టాలకు లోనవుతారు. మితి మీరిన ఔదార్యం వల్ల ఆర్థికంగా నష్టపోతారు. కొందరు స్నేహితులు మీ బలహీనతలను అవకాశంగా తీసుకుని సమస్యలు సృష్టిస్తారు.ఇతరులను గుడ్డిగా నమ్మటం, వారికి ఆర్థిక బాధ్యతలు అప్పగించడం వంటి పనులు ఎట్టి పరిస్థితిలో చేయవద్దని పండితులు సూచిస్తున్నారు.
ధనుస్సు రాశి : ఈ రాశి వారికి ఆర్థికపరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. గురుడు బలం అనుకూలంగా ఉండటం వలన చాలాసమస్యలు పరిష్కారమవుతాయి. ఆరోగ్య విషయంలో ... కొద్దిగా అనారోగ్యానికి గురవుతారు. ఎలాంటి ఆందోన చెందాల్సిన అవసరం లేదు.ఇంతవరకు సంతానం లేనివారికి సంతానయోగం పడుతుంది.సమాజంలో గౌరవం.. కీర్తి .. ప్రతిష్టలు పెరుగుతాయి. ఆశించిన దాని కంటే ఎక్కువగా ఆదాయం పెరుగుతుంది. సంతానం వృద్దిలోకి వస్తుంది. మిథునరాశిలో గురుడ ఉదయించడం వలన వృత్తి ఉద్యోగాలపరంగా అధికార యోగానికి, అనూహ్యమైన పురోగతికి అవకాశం ఏర్పడుతుంది.
మకర రాశి : ఈ రాశి వారికి గురుడు మిథున రాశిలో ఉదయించడం వలన ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలేంటాయి. ఉద్యోగస్తులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులు మిశ్రమఫలితాలు పొందుతారు. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. గతంలో రావలసిన మొండి బకాయిలు వసూలవుతాయి. ఉద్యోగ పరంగా కొన్ని సానుకూల మార్పులు జరగటానికి అవకాశం ఉంది. ఉద్యోగం మారటానికి కూడా అవకాశం ఉంటుంది. గృహ వాహన సౌఖ్యాలకు అవకాశం ఉంది. తల్లి ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలిగించే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు.
కుంభరాశి: మిథునరాశిలో గురు సంచార ప్రభావం కారణంగా, కుంభ రాశి వారు జీవితాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి మరియు కొత్త మార్గాల కోసం వెతకడానికి ప్రయత్నిస్తారు. ప్రతి విషయాన్ని కుటుంబసభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోండి. ఏవిషయంలో కూడా తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. స్నేహి తుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. సమాజంలో గౌరవం .. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వీలైనంత వరకు ప్రయాణాలు చేయకపోవడం మంచిది. ప్రయాణాల వల్ల అనారోగ్యానికి గురి కావడం ... డబ్బు నష్టపోవడం వంటివి జరిగే అవకాశం ఉందని పండితులు సూచిస్తున్నారు.
మీన రాశి : ఈ రాశి వారు కొత్తగా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. గతంలో రావలసిన మొండి బాకీలు వసూలు అవుతాయి. కొత్త ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్తగా స్థిరాస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. దాంపత్య జీవితం ఆనందంగా సాగిపోతుంది. పెళ్లి సంబంధం కోసం ఎదురు చూసే వారు గడ్ న్యూస్ వింటారు. ఆదాయ పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఉద్యోగస్తులకు అనుకున్న పనులు అనున్నట్టుగా జరుగుతాయి. వ్యాపారస్తులకు అధికంగా లాభాలు వస్తాయి.ఏ విషయంలోనూ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అంతా మంచే జరుగుతుంది.