పట్టాలు తప్పిన గువాహటి - బికనేర్ ఎక్స్ప్రెస్

పట్టాలు తప్పిన గువాహటి - బికనేర్ ఎక్స్ప్రెస్

బెంగాల్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. గౌహతి బికనేర్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. సాయంత్రం 5గంటల సమయంలో ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో రైలు 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నట్లు సమాచారం. విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు సహాయకచర్యలు ముమ్మరం చేశారు. స్థానికుల సాయంతో గాయపడినవారిని జల్పాయ్గుడి హాస్పిటల్ కు తరలించారు. ప్రమాదానికి కారణాలు తెలుసుకునేందుకు విచారణకు ఆదేశించారు. 

బెంగాల్ లో రైలు ప్రమాదంపై ప్రధాని నరేంద్రమోడీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. మరోవైపు రైల్వే శాఖ మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి లక్ష, స్వల్ప గాయాలైన వారికి రూ.25వేలు చొప్పున పరిహారం ప్రకటించింది.