హెచ్1బీ వీసా.. టాలెంట్ ఉన్నోళ్లకే
వీసా రూల్స్‌లో మార్పులు చేసిన ట్రంప్
వాషింగ్టన్: అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ పోతూపోతూ హెచ్1బీ వీసా రూల్స్‌లో మార్పు చేశారు. వీసాల జారీకి అమలు చేస్తున్న లాటరీ పద్ధతికి ముగింపు పలికారు. ఇకపై ఏ కంపెనీ అయినా విదేశీ ఉద్యోగులను తీసుకునేటప్పుడు ఎక్కువ జీతం, ప్రతిభ ఉన్న వారికే అవకాశం ఇవ్వాలని పేర్కొంటూ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి 60 రోజుల్లోగా దానిని అమలు చేయాలని అందులో పేర్కొన్నారు. మరో రెండు వారాల్లో అధికారం నుంచి తప్పుకోబోతున్న టైంలోనే ట్రంప్ ఈ కొత్త ఆదేశాలు ఇవ్వడం గమనార్హం. అయితే, దీని వల్ల ఇండియన్లపై ఎలాంటి ప్రభావం ఉండబోతోందన్న దానిపై ఇప్పుడే ఓ అంచనాకు రాలేమని నిపుణులు అంటున్నారు.
దోచుకుంటున్నారన్న యూఎస్సీఐఎస్
అమెరికా ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్ (యూఎస్సీఐఎస్) డిప్యూటీ డైరెక్టర్ జోసెఫ్ ఎడ్లో అన్నారు. టెంపరరీ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ కింద ప్రతిభ ఉన్న విదేశీయులకు అవకాశాలు వస్తాయని చెప్పారు. ఇంతకుముందున్న రూల్స్‌తో కంపెనీలు అమెరికన్ల ప్రయోజనాలను దోచుకుంటున్నాయని అన్నారు.
For More News..
ఆరు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ.. హెచ్చరించిన కేంద్రం
ట్రంప్‌కు ట్విట్టర్ షాక్.. అకౌంట్‌పై శాశ్వత నిషేధం
ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. పది మంది పిల్లలు మృతి
