TSPSC Paper Leak : పాస్ వర్డ్ హ్యాక్ చేసి పేపర్లు డౌన్ లోడ్ చేసిన్రు : పోలీసులు

TSPSC Paper Leak : పాస్ వర్డ్ హ్యాక్ చేసి పేపర్లు డౌన్ లోడ్ చేసిన్రు : పోలీసులు

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ఇప్పటివరకు తొమ్మిది మందిని అరెస్టు చేశామని డీసీపీ స్పష్టం చేశారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు టీఎస్పీఎస్సీ ఉద్యోగి ప్రవీణ్ అని, ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రాజశేఖర్ అనే వ్యక్తి కలిసి ఈ పని చేశారని తేల్చారు. పాస్ వర్డ్ హ్యాక్ చేసి ఎగ్జామ్ పేపర్స్ ను డౌన్ లోడ్ చేశారన్నారు. వీరితో పాటు ఇటీవలే టీఎస్పీఎస్సీ పరీక్ష రాసి ఎంపికైన రేణుక అనే గురుకుల్ టీచర్ కూడా ఉన్నారని చెప్పారు. డౌన్ లోడ్ చేసిన పేపర్స్ ను రేణుక ఇంటికి తీసుకెళ్లిందని, ఆ తర్వాత అభ్యర్థులైన గోపాల్ నాయక్, శ్రీను నాయక్ లకు వాట్సాప్ లో వాటిని సెండ్ చేసిందని పోలీసులు తెలిపారు. రేణుక భర్త కూడా డీఆర్డీఏలో టెక్నికల్ విభాగంలోనే పని చేస్తాడని కూడా చెప్పారు.

మార్చి 5న అసిస్టెంట్ ఇంజినీర్స్ ఎగ్జామ్ ఉండగా.. పరీక్షకు రెండు రోజుల ముందే పేపర్స్ ను లీక్ చేశారని పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ఇంకా ఏమేం పేపర్లు లీక్ అయ్యాయో ఇప్పుడే ఏం చెప్పలేమని, ఫోరెన్సిక్ రిపోర్టు తర్వాతే అది తెలుస్తుందన్నారు. అసలు వీరంతా కలిసి ఈ పని ఎందుకు చేశారన్న విషయం ఇంకా తెలియదని చెప్పారు. గతంలో వీరు ఇంకా ఏమైనా అవకవతలు చేశారా అన్న కోణంలోనూ విచారణ చేస్తున్నామని పోలీసులు స్పష్టం చేశారు.