
పాకిస్థాన్ క్రికెట్ లో ఊహించని విచార సంఘటన. పాకిస్థాన్ యువ క్రికెటర్ హైదర్ అలీని గ్రేటర్ మాంచెస్టర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అత్యాచారం కేసులో ఈ 24 ఏళ్ళ క్రికెటర్ ను అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. ఇంగ్లాండ్ లో అత్యాచారం ఆరోపణలపై హైదర్ అలీని అరెస్టు చేసిన తర్వాత తక్షణమే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) అతనిపై తాత్కాలికంగా సస్పెన్షన్ విధించింది. దర్యాప్తు పూర్తయ్యే వరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని పాక్ బోర్డు ప్రకటించింది. ఈ దురదృష్టకర సంఘటన జూలై 23, 2025 మాంచెస్టర్‌లోని ఒక ప్రాంగణంలో జరిగినట్టు సమాచారం.
2025 జూలై 23న హైదర్ అలీ తనపై అత్యాచారం జరిపినట్లు ఒక యువతి గ్రేటర్ మాంచెస్టర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆగస్టు 3న హైదర్ అలీని అదుపులోకి తీసుకున్నారు. ఆగస్టు 4న పోలీసులు హోవ్‌లో అరెస్టు చేశారు. ప్రస్తుతం పాకిస్తాన్-ఏ తరఫున ఇంగ్లాండ్-ఏ జట్టుతో బెకెన్హెయిమ్‌లో జరుగుతున్న వన్డే సిరీస్‌లో పాల్గొంటున్న ఈ పాక్ క్రికెటర్ అత్యాచారం కేసులో ఇరుక్కున్నట్లు సమాచారం.
"సోమవారం (ఆగస్టు 4) 2025న అత్యాచారం జరిగినట్లు నివేదిక అందిన తర్వాత, మేము హైదర్ అలీ అరెస్ట్ చేశాము. ఈ సంఘటన బుధవారం (జూలై 23) మాంచెస్టర్‌లోని ఒక ప్రాంగణంలో జరిగిందని ఆరోపించబడింది". అని గ్రేటర్ మాంచెస్టర్ పోలీసులు రాయిటర్స్‌కు పంపిన ఇమెయిల్‌లో తెలిపారు. తదుపరి విచారణలు జరిగే వరకు అతన్ని బెయిల్‌పై విడుదల చేశారు. "క్రికెటర్ హైదర్ అలీపై గ్రేటర్ మాంచెస్టర్ పోలీసులు ప్రస్తుతం క్రిమినల్ దర్యాప్తు నిర్వహిస్తున్నారని పీసీబీకి సమాచారం అందింది" అని పీసీబీ ప్రకటన పేర్కొంది.
►ALSO READ | Virat Kohli: కలర్ వేయకపోతే కింగ్ ఇలా ఉంటాడా.. షాక్ ఇస్తున్న కోహ్లీ ఓల్డ్ లుక్
ఈ ఘటనపై స్పందించిన పీసీబీ, హైదర్ అలీకి అవసరమైన చట్టపరమైన సహాయం అందిస్తామని తెలిపింది. హైదర్ అలీ 2020లో పాకిస్థాన్ తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. తన కెరీర్ లో ఇప్పటి వరకు కేవలం 2 వన్డేలు మాత్రమే ఆడిన హైదర్.. 35 టీ20 మ్యాచ్ లు ఆడాడు. వన్డేల్లో 21 సగటుతో 42 పరుగులు.. టీ20ల్లో 17.4 సగటుతో 505 పరుగులు చేశాడు. అయితే ఇప్పటి వరకు ఒక్క టెస్టు మ్యాచ్‌లోనూ అతడు ఆడలేదు. హైదర్ అలీ చివరిసారిగా 2023 అక్టోబర్ 6న హాంగ్‌జౌలో జరిగిన ఆసియా క్రీడల్లో ఆఫ్ఘనిస్తాన్‌పై పాకిస్తాన్ తరఫున ఆడాడు.
Haider Ali
— Lord Immy Kant (@KantInEastt) August 8, 2025
> be a Pakistani player
> tour UK for a cricket match
> Pakistani rápe instinct activates
> get arrested for rápe of a British girl, in Manchester
> get suspended by PCB
> not beating the grooming gang allegations pic.twitter.com/FgJZmxoyxw