బెంగాల్, బీహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాష్ట్రాలలో 4 రోజులు వడగాలులు

బెంగాల్, బీహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాష్ట్రాలలో 4 రోజులు వడగాలులు

న్యూఢిల్లీ: వచ్చే 4 రోజులు తూర్పు భారతదేశంలో వడగాడ్పులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. నార్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రీజియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రెండు రోజులపాటు హీట్ వేవ్ కండిషన్లు ఉంటాయని సోమవారం తెలిపింది. ఈ మేరకు పశ్చిమ బెంగాల్, బీహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నాలుగు రోజులు.. సిక్కిం, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో రెండు మూడు రోజులు వడగాడ్పులు వీచే అవకాశం ఉందని చెప్పింది.

యూపీలో కూడా రెండు రోజులు ఇలాంటి కండిషన్లే ఉండొచ్చని పేర్కొంది. ‘‘బెంగాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 6 రోజులుగా, ఏపీ తీర ప్రాంతాల్లో 4 రోజులుగా, బీహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 3 రోజులుగా పలుచోట్ల వేడిగాలులు వీస్తున్నాయి. పంజాబ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వచ్చే 3 రోజులు అక్కడక్కడ వానలు పడొచ్చు. జమ్మూకాశ్మీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, లడఖ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మంగళవారం, హిమాచల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు కురవొచ్చు” అని ఐఎండీ అంచనా వేసింది