వికారాబాద్ స్టేషన్​లో కోణార్క్, రాజ్​కోట్ రైళ్లకు హాల్టింగ్

వికారాబాద్ స్టేషన్​లో కోణార్క్, రాజ్​కోట్ రైళ్లకు హాల్టింగ్

 వికారాబాద్, వెలుగు: వికారాబాద్ రైల్వే స్టేషన్​లో కోణార్క్, రాజ్ కోట్ ఎక్స్ ప్రెస్ రైళ్లకు తాత్కాలిక హాల్టింగ్ ఉంటుందని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.  ముంబయి నుంచి భువనేశ్వర్ వెళ్లే కోణార్క్ ఎక్స్ ప్రెస్ ఈ నెల 30,31 తేదీల్లో ఫిబ్రవరి 10,11,12 తేదీల్లో వికారాబాద్ రైల్వే స్టేషన్​లో ఆగుతుందన్నారు. ఇవే తేదీల్లో రాజ్​కోట్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే రాజ్​కోట్ ఎక్స్​ప్రెస్ సైతం వికారాబాద్ స్టేషన్​లో ఆగుతుందన్నారు.

అదేవిధంగా ఫిబ్రవరి 2,3,14,15 తేదీల్లో భువనేశ్వర్ నుంచి ముంబయి వెళ్లేప్పుడు సైతం  కోణార్క్ ఎక్స్ ప్రెస్​కు వికారాబాద్ స్టేషన్​లో హాల్టింగ్ ఉంటుందన్నారు. ఫిబ్రవరి 3,4,15,16 తేదీల్లో సికింద్రాబాద్ నుంచి రాజ్ కోట్ వెళ్లేప్పుడు రాజ్ కోట్ ఎక్స్ ప్రెస్​కు హాల్టింగ్ ఉంటుందని అధికారులు తెలిపారు. ప్యాసింజర్ల రెస్పాన్స్​ను చూసి వికారాబాద్ స్టేషన్ ఈ రైళ్లకు హాల్టింగ్ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.