
కరీంనగర్ టౌన్, వెలుగు: కిడ్నాప్ అయిన బాలున్ని కరీంనగర్ టాస్క్‌ఫోర్స్ ఆఫీసర్లు శుక్రవారం ముంబై పోలీసులకు అప్పగించారు. జగిత్యాల జిల్లా బుగ్గారానికి చెందిన డిష్ టెక్నిషియన్, తన పాత స్నేహితుడితో కలిసి ఆగస్టు31నముంబైలోని బాంద్రా ఏరియాలో బాలున్ని కిడ్నాప్ చేసి తీసుకొచ్చాడు. బాంద్రా పోలీసుల సమాచారంతో కరీంనగర్ టాస్క్‌ఫోర్స్‌బృందం నిందితులను గుర్తించి గురువారం అదుపులోకి తీసుకుంది. బాలుడు క్షేమంగా ఉన్నాడని తెలియచేయడంతో శుక్రవారం ముంబై పోలీసులు కరీంనగర్‌కు వచ్చారు. బాలున్ని అడిషనల్ డీసీపీ(అడ్మిన్)జి.చంద్రమోహన్ వారికి అప్పగించారు. వేగంగా స్పందించి కేసును సాల్వ్చేసిన టాస్క్ ఫోర్స్ సీఐలు మల్లయ్య,సృజన్ రెడ్డిలను డీజీపీ మహేందర్‌రెడ్డి, కరీంనగర్సీపీ సత్యనారాయణ అభినందించారు.