శాయంపేట/ పరకాల, వెలుగు: ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు సరిపడా ఉన్న విద్యార్థుల సంఖ్య తగ్గిందని, పెంచాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ సూచించారు. మంగళవారం హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలోని మైలారంలో ఉపాధిహామీ పనులు, జీపీ ఆఫీస్, ఆంగన్వాడీ కేంద్రం, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో ఐదుగురు ఉపాధ్యాయులకు 50 మంది పిల్లలే ఉన్నారని, అందులో కొందరు గైర్హాజరయ్యారని అసహనం వ్యక్తం చేశారు.
అంగన్వాడీ కేంద్రంలో ఇద్దరు పిల్లలు పిల్లలు ఉండడంతో కారణాలు అడిగి తెలుసుకున్నారు. జీపీ ఆఫీస్‌లో వీధిలైట్లు, బ్లీచింగ్ పౌడర్ తదితర వివరాలు అడిగారు. పెద్ద చెరువు వద్ద ఉపాధి పనిని పరిశీలించారు. పదిరోజుల్లో వారికి డబ్బులు జమ అవుతాయని చెప్పారు. అనంతరం ఆమె పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డితో కలిసి మున్సిపల్ ఆఫీస్సమీపంలోని భూమిని పరిశీలించారు. యువత నైపుణ్య అభివృద్ధి కోసం అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్కీలకమని, దానితో పట్టణం మరింత అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే అన్నారు. అంతకుముందు వారు ఎస్సీ, బీసీ వెల్ఫేర్ హాస్టళ్లను తనిఖీ చేశారు.

