HanuMan 100 Days: వందరోజులు పూర్తిచేసుకున్న హనుమాన్.. దర్శకుడు ఎమోషనల్ పోస్ట్

HanuMan 100 Days: వందరోజులు పూర్తిచేసుకున్న హనుమాన్.. దర్శకుడు ఎమోషనల్ పోస్ట్

హనుమాన్(HanuMan).. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర క్రియేట్ చేసిన సంచలనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్న సినిమాగా వచ్చి భారీ విజయాన్ని సాధించింది హనుమాన్. సూపర్ హీరో కాన్సెప్ట్ కి ఇండియన్ మైథాలజీని లింక్ చేసి దర్శకుడు ప్రశాంత్ వర్మ(Prasanth Varama) క్రియేట్ చేసిన ఈ అద్భుతానికి ఆడియన్స్ ఫిదా అయ్యారు. థియేటర్స్ లో హనుమాన్ చేసిన వీరవహారానికి ప్రేక్షకులు మంత్రముగ్దులు అయిపోయారు. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే హనుమాన్ ఎంట్రీ సీన్ ఆడియన్స్ కి గూస్బంప్స్ తెప్పించింది. కేవలం రూ.40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది.

ఇటీవలే ఓటీటీలో వచ్చి అక్కడ కూడా సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసిన ఈ హనుమాన్.. తాజాగా మరో మైలు రాయిని చేరుకుంది. ఏప్రిల్ 22 నాటికి ఈ సినిమా వందరోజులు పూర్తిచేసుకుంది. ఈ సందర్బంగా ఎమోషనల్ పోస్ట్ చేశాడు చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ.. మా ఈ అద్భుతమైన ప్రయాణంలో భాగమైనందుకు ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు. హనుమాన్ సినిమా వంద రోజుల వేడుకలను థియేటర్లలో జరుపుకోవడం అనేది నా లైఫ్ టైం ఆరాధించే విషయం. ప్రస్తుత కాలంలో ఒక చిన్న సినిమా థియేట‌ర్‌ల‌లో వంద రోజులు ఆడటం అనేది మాములు విషయం కాదు. ఆ అరుదైన మైలురాయిని అందించిన ప్రేక్షకులకు నా కృతజ్ఞతలు. ఈ ప్రయాణంలో నా వెంట ఉండి, నాకు మద్దతిచ్చిన మీడియా మిత్రులకు, నా టీమ్ మొత్తానికి ధన్యవాదాలు.. అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు ప్రశాంత్.

ఇక ప్రశాంత్ వర్మ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన హనుమాన్ సినిమాకు సీక్వెల్ గా జై హనుమాన్ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా నుండి ఇటీవల శ్రీరామ నవమి సందర్బంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ తెగ వైరల్ అయ్యింది. అంతేకాదు.. సినిమాపై అంచనాలను కూడా పెంచింది. మరి భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న జై హనుమాన్ మూవీ ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.