రూ.2 వేల కరెన్సీ నోటును చలామణి నుంచి ఉపసంహరిస్తూ కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంతోషంగా ఉందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం అన్నారు. కేంద్ర ప్రభుత్వం చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి ఏడేళ్లు పట్టిందన్నాదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రూ.1,000 కరెన్సీ నోటును తిరిగి మార్కెట్లోకి ప్రవేశపెడుతుందని తాను భావిస్తున్నానని తెలిపారు.
రూ.1,000, రూ.500 కరెన్సీ నోట్లను ఉపసంహరించుకోవడం కేంద్రం చేసిన ఘోర తప్పిదమని దీనిని దేశ ప్రజలు అంగీకరించలేదని పి.చిదంబరం చెప్పారు. కేంద్ర ప్రభుత్వ చర్య సామాన్యులను అయోమయానికి గురి చేసిందని దుయ్యబట్టారు. తాను 2016లోనే చెప్పానని ఇప్పుడు అదే నిజమైందని చెప్పుకొచ్చారు. రూ. 1,000, 500 నోట్లను రద్దు చేయాలని కేంద్రం తీసుకున్న తెలివితక్కువ నిర్ణయానికి ముసుగు వేసేందుకే రూ. 2,000 నోటు తెచ్చారని పి.చిదంబరం చెప్పు్కోచ్చారు.
భారతీయ రిజర్వ్ బ్యాంక్ 2023 మే 19 శుక్రవారం రోజున రూ. 2 వేల నోట్లను ఉపసంహరించుకుంది. మే 23 నుంచి ఆర్‌బీఐ రీజనల్ ఆఫీసుల్లో 2 వేల నోట్లను మార్చుకోవచ్చని ఆర్బీఐ పేర్కొంది. రూ. 2 వేల నోట్లను సర్కూలేషన్‌లో ఉంచొద్దని బ్యాంక్‌లకు ఆదేశించింది. దేశంలో వున్న 19 ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో రూ.2 వేల నోట్ల మార్పిడికి అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది.
గత కొద్ది కాలంగా రూ. 2 వేల నోట్లు మార్కెట్లో సప్లై కావడం లేదు. రూ. 1000 స్థానంలో రూ. 2 వేల నోటును కేంద్రం తీసుకొచ్చింది. 2016లో పాత నోట్లను రద్దు చేసి కొత్త నోట్లను చలామణిలోకి తీసుకొచ్చింది. అప్పటి నుంచి చెలామణిలో ఉన్న రూ. 2వేల నోట్లను.. క్లీన్ నోట్ పాలసీలో భాగంగా ఉపసంహరించుకున్నది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
