ప్రతి ఏడాది నవంబర్ 19న అంతర్జాతీయ పురుషుల దినోత్సవం జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా పురుషులు ఎదుర్కొంటున్న కష్టాలను, సవాళ్లను (హింస, మానసిక ఆరోగ్యం, ఆత్మహత్య వంటివి) ఈ రోజు గుర్తుచేస్తుంది.
అలాగే, సమాజం అభివృద్ధికి పురుషులు చేసిన మంచి పనులను, సహకారాన్ని కూడా ఈ రోజు గౌరవిస్తుంది. మంచి ఆదర్శంగా నిలిచే పురుషులను ప్రోత్సహించడం, అందరూ సంతోషకరమైన, ఆరోగ్యకరమైన జీవితం గడపాలని కోరుకోవడం ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం.
ఈ సంవత్సరం కూడా, పురుషుల మంచి ఆరోగ్యం, వాళ్ల మనసులోని బాధలు, కష్టాల గురించి అందరూ మాట్లాడటం ఎంత ముఖ్యమో ఈ రోజు తెలియజేస్తుంది.
అంతర్జాతీయ పురుషుల దినోత్సవం 2025 థీమ్:
*మంచి ఆదర్శాలు: మంచి పనులు చేసే పురుషులను గౌరవించడం.
*ఆరోగ్యం: పురుషులు, అబ్బాయిల శారీరక, మానసిక ఆరోగ్యానికి మద్దతు ఇవ్వడం.
*సమానత్వం: స్త్రీ, పురుష సమానత్వాన్ని ప్రోత్సహించడం.
*సహకారం: కుటుంబంలో, సమాజంలో పురుషులు, అబ్బాయిలు అందించే సహాయాన్ని, సహకారాన్ని గుర్తించడం.
అంతర్జాతీయ పురుషుల దినోత్సవం చరిత్ర:
అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని మొట్టమొదట 1999లో ట్రినిడాడ్ & టొబాగోలో డాక్టర్ జెరోమ్ టీలక్సింగ్ ప్రారంభించారు. తన తండ్రి పుట్టినరోజును, దేశ ఫుట్‌బాల్ చరిత్రలో ఒక ముఖ్యమైన రోజును గుర్తుచేసుకుంటూ ఆయన నవంబర్ 19ని ఎంచుకున్నారు. చిన్నగా మొదలైన ఈ ఆచారం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 80 కంటే ఎక్కువ దేశాలలో జరుపుకునే పెద్ద ఉద్యమంగా మారింది. ఈ రోజు ఉద్దేశం మంచి పురుషులను హైలైట్ చేయడం అలాగే ప్రపంచంలో పురుషులు ఎదుర్కొనే సమస్యల గురించి చర్చలు పెంచడం.
ఆస్ట్రేలియా, UK వంటి కొన్ని దేశాలు మగవారు, అబ్బాయిలకు అండగా నిలబడటం పై ఇప్పుడు ఎక్కువ దృష్టి పెడుతున్నాయి.2025 సంవత్సరానికి, పురుషుల ఆత్మహత్యలు సున్నా (జీరో మేల్ సూసైడ్) అనే నినాదంతో అనేక కార్యక్రమాలు మొదలవుతున్నాయి. వీటి ద్వారా మగవారిలో ఉండే మానసిక ఆరోగ్య సమస్యలను ముఖ్యంగా తెలియజేయాలని చూస్తున్నారు.
అంతర్జాతీయ పురుషుల దినోత్సవ విషెస్, మెసేజులు
1.ప్రతిరోజూ మాకు స్ఫూర్తినిచ్చే పురుషులందరికీ ఈ రోజు అంకితం. హ్యాపీ మెన్స్ డే!
2.ప్రపంచాన్ని మరింత మంచిగా మారుస్తున్న ప్రతి పురుషుడికి అంతర్జాతీయ పురుషుల దినోత్సవ శుభాకాంక్షలు.
3.అద్భుతమైన పురుషులందరికీ... మీరు ఎప్పుడూ ప్రకాశిస్తూ, ఎదుగుతూ ఉండాలి. హ్యాపీ మెన్స్ డే!
4.కష్టపడి పనిచేసే, ప్రేమించే మరియు స్ఫూర్తినిచ్చే పురుషులందరికీ అభినందనలు.. చీర్స్ ! హ్యాపీ మెన్స్ డే!
