
తన భార్య గర్భవతిగా ఉందని.. త్వరలోనే తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు తమిళ్ స్టార్ డైరెక్టర్ ‘అట్లీ’ వెల్లడించారు. తన భార్య ప్రెగ్నెన్సీ గురించి ట్విట్టర్ లో వెల్లడించారు. దీంతో అభిమానులు, నటీ నటులు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. తమ కుటుంబం పెద్దది అవుతోందని.. శుభవార్తను అందరితో పంచుకోవడం తనకెంతో ఆనందంగా ఉందని తెలిపారు. అద్భుతమైన ప్రయాణంలో అందరి ఆశీస్సులు కావాలని ట్వీట్ లో వెల్లడించారు. ఫొటోలో బేబీ బంప్ తో ఉన్న భార్యతో అట్లీ నవ్వులు చిందిస్తున్నారు.
అట్లీ-ప్రియ దంపతులు తల్లిదండ్రులు అవుతుండడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అట్లీ విషయానికి వస్తే.. ‘రాజా రాణి’ సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించారు. కోలీవుడ్ లో ఆయన సినిమాలు ఘన విజయం సాధించాయి. మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా మారిపోయిన ఈయన.. తేరి, మెర్సల్, బిగిల్ వంటి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రూపొందించారు. సీరియల్స్ లో నటించే ప్రియ..అట్లీలు ప్రేమించుకున్నారు. కొన్నాళ్ల అనంతరం ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో 2014లో వీరు పెళ్లి చేసుకున్నారు.