హైదరాబాద్ లో మహిళలపై వేధింపులు పెరుగుతున్నయ్ : ఎస్. శాంత కుమారి

హైదరాబాద్ లో మహిళలపై వేధింపులు పెరుగుతున్నయ్ : ఎస్. శాంత కుమారి

మాదాపూర్, వెలుగు:  సిటీలో మహిళలపై వేధింపులు పెరుగుతున్నాయని ఎఫ్‌‌ఐజీవో ట్రెజరర్‌‌‌‌, ప్రసూతి అండ్ గైనకాలజికల్‌‌ సొసైటీ ఆఫ్ హైదరాబాద్ ఆర్గనైజింగ్ చైర్‌‌పర్సన్, ప్రెసిడెంట్ ప్రొఫెసర్ ఎస్. శాంత కుమారి ఆవేదన వ్యక్తంచేశారు. మాదాపూర్‌‌‌‌లోని హైటెక్స్​లో ఫెడరేషన్‌‌ ఆఫ్‌‌ అబ్‌‌స్ట్రెక్టివ్‌‌ అండ్ గైనకాలజీ సొసైటీస్ ఆఫ్ ఇండియా (ఎఫ్ వోజీఎస్ఐ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 66వ ఆల్ ఇండియా కాంగ్రెస్ ఆఫ్ అబ్‌‌స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ –2024  సదస్సు నిర్వహిస్తున్నారు.

ఇందులో భాగంగా సోమవారం 'ధీర -మహిళలపై హింసను అరికట్టండి' అంశంపై నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆపదలో ఉన్న మహిళకు మార్గనిర్దేశం చేసేందుకు, సాయం చేయడానికి ఎఫ్​వోజీఎస్ఐ సభ్యులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఈ ప్రోగ్రాం కోసం యూనిసెఫ్​తో టై అప్ అయ్యామని, 5800 మంది గైనకాలజిస్ట్​లు, 6  వేల మంది టీచర్లు మాస్టర్ ట్రైనర్లుగా శిక్షణ పొందారన్నారు.  

సుమారు 3 లక్షల మంది స్టూడెంట్లు ఉన్నారన్నారు.  షీ టీమ్స్, నేషనల్ కమిషన్ ఆఫ్ విమెన్‌‌తో కూడా భాగస్వామ్యం చేస్తున్నామన్నారు.  కార్యక్రమంలో సినీ ప్రొడ్యూసర్​ప్రియాంక దత్ , వీ హబ్ సీఈవో దీప్తి రావుల, ప్రొఫెసర్ అని-బీట్రైస్ కిహారా,  ఎఫ్‌‌వోజీఎస్ఐ ప్రెసిడెంట్ జయదీప్ పాల్గొన్నారు.