IPL 2024: ఐపీఎల్ లేకుంటే నాకు అదొక్కటే దిక్కు.. హార్దిక్ పాండ్య ఎమోషనల్

IPL 2024: ఐపీఎల్ లేకుంటే నాకు అదొక్కటే దిక్కు.. హార్దిక్ పాండ్య ఎమోషనల్

హార్దిక పాండ్య.. ప్రస్తుతం ఈ పేరుకు చాలా క్రేజ్ ఉంది. ఐపీఎల్ లో అతి పెద్ద ఫ్రాంచైజీ అయిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా.. టీమిండియాకు పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ గా.. స్టార్ ఆల్ రౌండర్ గా బాగా క్రేజ్ సంపాదించాడు. అయితే ఒకానొక దశలో పాండ్యపై దారుణంగా ట్రోల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. కెరీర్ లో గడ్డు పరిస్థితులను వచ్చినా తట్టుకొని నిలబడి.. తనను నిరూపించుకొని స్టార్ ఆల్ రౌండర్ గా ఎదిగాడు. తన క్రికెట్ ప్రయాణంలో ఐపీఎల్ తన కెరీర్ ను మార్చేసిందని పాండ్య ఎమోషనల్ అయ్యాడు. 

Also Read: బీజేపీతో కలిసి నన్ను చంపాలని చూస్తున్నాడు.. షమీ భార్య సంచలన ఆరోపణలు

2024 ఐపీఎల్ సీజన్ కు ముందు రోహిత్ శర్మ స్థానంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యాను నియమించిన సంగతి తెలిసిందే. పాండ్యకు వ్యక్తిగతంగా ఇది పదో ఐపీఎల్ సీజన్. ఈ సందర్భంగా పాండ్యా ఐపీఎల్ కు కృతజ్ఞతలు తెలిపాడు. " నాకు ఇది  పదో ఐపీఎల్ సీజన్. ఐపీఎల్ నన్ను స్టార్ ఆల్ రౌండర్ గా గుర్తింపు తీసుకొని వచ్చింది. ఐపీఎల్ లేకపోతే నేను బరోడాలోనే ఉండి దేశవాళీ క్రికెట్ ఆడుకునేవాడిని. నా ప్రయాణంలో నాకు సహకరించిన వారికి, నా ఎదుగుదలకు తోడ్పడిన వారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు". అని ఐపీఎల్ ప్రారంభానికి ముందు పాండ్య చెప్పుకొచ్చాడు.        

హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్‌ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేసాడు. 2022లో ముంబై అతన్ని వదిలేసినా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గా తొలి సీజన్ లోనే ట్రోఫి అందించాడు. 2023 సీజన్ లోనూ జట్టును రన్నరప్ గా నిలిపాడు. ట్రేడింగ్ ద్వారా ముంబై జట్టులోకి చేరిన పాండ్యను 2024 సీజన్ కు ముంబై యాజమాన్యం కెప్టెన్ గా ప్రకటించింది. ఈ సీజన్ లో రోహిత్ లేకపోవడంతో ముంబైని పాండ్య ఎలా నడిపిస్తాడో ఆసక్తికరంగా మారింది.